యువతకు ప్రాధాన్యత

ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యేను నేరుగా కలవాలి
–యువనేత మనోజ్‌కుమార్‌రెడ్డి పిలుపు

ఆదోని టౌన్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ యువతకు పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి తనయుడు, యువనేత మనోజ్‌కుమార్‌రెడ్డి అన్నారు. యూత్‌కు ఏ సమస్య వచ్చినా తననుగాని, ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డినిగాని నేరుగా కలిసి సమస్యను పరిష్కరించుకోచ్చని చెప్పారు. యూత్‌కు అండగా వుంటానని పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని 5వ వార్డు మాసా మసీదు ఏరియా ప్రాంతానికి చెందిన దాదాపు వంద మంది యువకులు బీకేకే రవి ఆధ్వర్యంలో మనోజ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద పార్టీలో చేరారు. ముందుగా మనోజ్‌కు పూలమాల వేసి సన్మానించారు. అనంతరం ఆయన యువతకు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా యూత్‌నాయకుడు రవి,రాఘవేంద్ర,జిలాన్‌ ,మోనో,షేక్షావలి,హనుమంతు,రఫిక్‌ మాట్లాడారు. 5వ వార్డులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని » లోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల నాటికి 5వ వార్డులో యూత్‌ అంతా ఐక్యమత్యమై పార్టీ పటిష్టత, ఎమ్మెల్యే గెలుపుకు కృషి చేస్తామన్నారు. జగనన్న రాజ్యం వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం చేకూరుతుందని చెప్పారు. ప్రజలకు అందుబాటులో వుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రజల మన్ననలు పొందడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో యూత్‌ వినోద్,రఘు, దుబాయ్,బాలక్రిష్ణ,వీరేష్,శివ తదితరులు పాల్గొన్నారు.

Back to Top