విజ‌యీభ‌వ‌- ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో స‌ర్వ‌మ‌త ప్రార్థ‌న‌లు
- వైయ‌స్ జ‌గ‌న్‌ను ఆశీర్వ‌దించిన పురోహితులు, పాస్ట‌ర్లు, ముస్లిం మ‌త పెద్ద‌లు
ప్ర‌కాశం: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు, ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతం కావాల‌ని, రాష్ట్రానికి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి కావాల‌ని స‌ర్వ‌మ‌త ప్రార్థ‌న‌లు చేశారు. ప్ర‌జా సంకల్ప యాత్ర ప్ర‌స్తుతం ప్ర‌కాశం జిల్లాలో కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్భంగా జిల్లాకు చెందిన ఆయా ప్ర‌ధాన ఆల‌యాల పురోహితులు,  జిల్లా పాస్ట‌ర్స్ అసోసియేష‌న్ దైవ‌జ‌నులు, ముస్లిం మ‌త పెద్ద‌లు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసి ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు, పూజ‌లు చేశారు.  రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపించేందుకు, ప్ర‌జ‌ల క‌ష్టాలు తీర్చేందుకు ఆ భ‌గ‌వంతుడు జ్ఞానం, బ‌లం, ధైర్యం ఇవ్వాల‌ని ప్రార్థించారు.  ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. దేవుడు ఆశీర్వ‌దించి, ప్ర‌జ‌ల ఆశీస్సుల‌తో ప్ర‌జా ప్ర‌భుత్వం వ‌చ్చాక అన్ని వ‌ర్గాల‌కు మేలు చేస్తాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ  ఇచ్చారు.
Back to Top