సిఎంతో పాటు అంతా పదవులను వదలాల్సిందే

హైదరాబాద్, 11 సెప్టెంబర్ 2013:

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తామంటూ కాంగ్రెస్‌ పార్టీ చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సహా సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేయాల్సిందేనని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకుడు ప్రవీణ్ కుమా‌ర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‌పదవులను వదలకుండానే సమైక్యాంధ్ర ముద్ర వేయించుకుంటామంటే కుదరదని ఆయన అన్నారు. టిడిపి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాజీనామాలు చేస్తే విభజన ప్రకటన వెనక్కి వెళుతుందని ప్రవీణ్ కుమా‌ర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తన వైఖరి చెప్పకుండా ఆత్మగౌరవ యాత్ర చేయటం సిగ్గుచేటు అన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు, నిరసనలు కాంగ్రె‌స్ పార్టీకి కనిపించటం లేదా అని ప్రవీణ్ కుమా‌ర్‌రెడ్డి ప్రశ్నించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top