ప్ర‌త్యేక హోదా మీద పార్ల‌మెంటులో వైఎస్సార్‌సీపీ పోరు

న్యూఢిల్లీ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా కావాలంటూ
వైఎస్సార్‌సీపీ పార్ల‌మెంటు వేదిక‌గా గ‌ళం ఎత్తింది. ఈ డిమాండ్ తో పార్టీ
పార్ల‌మెంటు స‌భ్యులు లోక్ స‌భ‌లో వాయిదా తీర్మానం అంద చేశారు. అంత‌కు
ముందు ఢిల్లీలో పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం జ‌రిగింది. ప్ర‌త్యేక హోదా
మీద పోరాటానికి సంబంధించిన వ్యూహం మీద చ‌ర్చించారు. ఈ అంశం మీద వాయిదా
తీర్మానం ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. త‌ర్వాత స‌భ సమావేశం స‌మ‌యంలో వాయిదా
తీర్మానం నోటీసును అంద‌చేశారు అయితే దీన్ని తిర‌స్క‌రిస్తున్న‌ట్లు
స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ప్ర‌క‌టించారు.
మ‌రో వైపు
రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాలన్న డిమాండ్ తో వైఎస్సార్‌సీపీ
అద్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ ఈ నెల 10న ఢిల్లీలో మ‌హా ధ‌ర్నా చేస్తున్నారు.
ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయిలోని క్రియాశీల నాయ‌కులు
ఇందులో పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గ
సాగుతున్నాయి.   ఈ నెల ఏడున తిరుప‌తి, అన‌కాప‌ల్లి నుంచి రెండు రైళ్లలో
నాయ‌కులు బయ‌లు దేరుతున్నారు.

తాజా ఫోటోలు

Back to Top