ప్రతిపక్షంపై చండ్రప్రతాపం..!

వైఎస్ జగన్ పోరాటాలపై అప్రజాస్వామిక దాడి..!
దీక్షను అడ్డుకునేందుకు కుయుక్తులు..!

గుంటూరుః రాష్ట్రంలో ప్రతిపక్షంపై పచ్చప్రభుత్వం దౌరన్యఖాండ కొనసాగుతూనే ఉంది. ప్రజాసమస్యలు, ప్రత్యేకహోదాపై అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అణగదొక్కేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తూనే ఉన్నాడు. స్పెషల్ స్టేటస్ కోసం పోరాడాల్సింది పోయి...అందుకోసం ఉద్యమిస్తున్న ప్రతిపక్ష నేతను అడ్డుకోవడంపై ప్రజలంతా మండిపడుతున్నారు. చంద్రబాబు నిర్వాకాన్ని చీధరించుకుంటున్నారు. 

అణిచివేత ధోరణి..!
ప్రత్యేకహోదా కోసం వైఎస్ జగన్ గొంతెత్తిన ప్రతిసారీ అణచివేసేందుకు కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన రాష్ట్రబంద్ పై లాఠీలు ఝులిపించి దాదాగిరి చేశారు. యూనివర్సిటీల్లో యువభేరి సదస్సులకు అనుమతి నిరాకరించారు. యువభేరికి రాకుండా విద్యార్థులను అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ప్రత్యేకహోదా కోసం నినదించిన ప్రొఫసెర్లపైనా పచ్చనేతలు అక్కసు ప్రదర్శించారు. యువభేరి సదస్సులో పాల్గొని వైఎస్ జగన్ కు మద్దతుగా నిలిచినందుకు ఇద్దరు ప్రొఫెసర్లకు సస్పెన్షన్ నోటీసులు జారీ చేశారు. వైఎస్ జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు కుళ్లు, కుతంత్రాలకు పాల్పడుతూనే ఉన్నారు.

దీక్షను అడ్డుకుంటే..!
సెప్టెంబర్ 26 నుంచి గుంటూరు వేదికగా వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధం కాగా వణికిపోయిన చంద్రబాబు పోలీసులను ఉసిగొల్పి దీక్షను అడ్డుకున్నాడు. రాత్రికి రాత్రే వైఎస్ జగన్ దీక్షాస్థలి వద్ద  ప్లెక్సీలు, పోస్టర్లను తీసివేయించి ఆటంకం సృష్టించాడు. రేపటి నుంచి గుంటూరు నల్లపాడు రోడ్డులో వైఎస్ జగన్ దీక్షకు దిగుతుండడంతో మరోసారి చంద్రబాబు కుట్రలకు తెరలేపుతున్నాడు. వైఎస్ జగన్ కు మద్దతుగా రాష్ట్ర ప్రజానీకమంతా కదం తొక్కుతుండడంతో అడ్డుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నాడు. దీక్షను అడ్డుకోవాలని చూస్తే చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రజలు, ప్రతిపక్షాల నేతలు హెచ్చరిస్తున్నారు. 
Back to Top