ప్రత్యేక హోదా కోసం ఆగిన మరో గుండె..

ప్రత్యేక హోదా కోసం ఈరోజు మరో గుండె ఆగింది. అయితే అది చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశ, అణచివేత వైఖరి కారణంగా జరిగింది. ప్రత్యేక హోదా కోసం రోడ్డెక్కిన పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం కృష్ణాపురం  వాస్తవ్యుడైన కాకి దుర్గారావును జంగారెడ్డిగూడెంలో పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌లో పెట్టారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన దుర్గారావుకు గుండె పోటు వచ్చి కుప్పకూలిపోయాడు. పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో దుర్గారావు మరణించాడు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని వైయస్‌ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆరోపించారు. ఇదిలాఉంటే..రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇప్పటికే పదుల సంఖ్యలో ఆత్మహత్యలు, బలవన్మరణాలకు పాల్పడ్డారు.  ప్రత్యేక హోదా అంటే బాబు జైల్లో పెట్టారు..ప్రత్యేక హోదా అని నినదిస్తే.. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గతంలో హెచ్చరించినట్టుగానే ఈరోజు ఏకంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డిని జైల్లో పెట్టారు. 

- ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్‌ జగన్‌  ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర బంద్‌ సంపూర్ణంగా విజయవంతమైంది.  బంద్‌కు సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రాజకీయ స్వలాభాల కోసం కొన్ని పార్టీలు, కొన్ని సంఘాలు బంద్‌కు దూరంగా ఉన్నా.. ప్రజలే స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి బంద్‌ను విజయవంతం చేశారు. స్కూళ్ళను, ప్రభుత్వ కార్యాలయాలను, వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులను ప్రజలే అడ్డుకున్నారు. ప్రయాణికులకు కొంత ఇబ్బంది  కలిగినా.. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్‌ ప్రజల భవిష్యత్తు కోసం చేస్తున్న నిరసన కాబట్టి అందరూ సహకరించారు. ఇది ప్రత్యేక హోదా కోసం చేసిన బంద్‌. ప్రజా బంద్‌.

 రాష్ట్రం యావత్తూ ప్రత్యేక హోదా – మా హక్కు.. అని నినదించింది. 5 కోట్ల  ఆంధ్రుల పోరాటం ప్రత్యేక హోదా కోసమేనని, ప్రత్యేక హోదా వస్తేనే మా జీవితాలు బాగుపడతాయని ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి తమ నిరసనను తెలియజేశారు. రాష్ట్ర బంద్‌ సెగ కేంద్రానికి సైతం తాకే ఉంటుంది. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. 

 ప్రత్యేక హోదా కోసం రాష్ట్రం ఉద్యమిస్తుంటే.. ఆ ఉద్యమాన్ని అణచివేసేందుకు,  ప్రత్యేక హోదా బంద్‌ను విఫలం చేసేందుకు మన తెలుగు వాడే, మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అడుగడుగునా ప్రయత్నాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ నిర్వహిస్తున్న వైయస్‌ఆర్‌సీపీ నేతల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. శాంతియుతంగా ధర్నాలు, బైఠాయింపులు చేస్తున్నవారిని పోలీసు వాహనాల్లో తీసుకెళ్ళి గంటల తరబడి పోలీస్‌ స్టేషన్లలో కూర్చోబెట్టారు. మరికొంతమంది నేతల్ని హౌస్‌ అరెస్టులు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో అయితే.. మహిళా కార్యకర్తల్ని మగ పోలీసులు పెడ రెక్కలు పట్టుకొని లాగి పడేశారు. మహిళలకు గాయాలై, రక్తం కారుతున్నా మనస్సు అనేదే లేకుండా, అమానవీయంగా నంద్యాల డీఎస్పీ నేతృత్వంలో పోలీసులు కార్యకర్తలపై తమ ప్రతాపాన్ని చూపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం. ఐదు కోట్ల  ఆంధ్రుల హక్కు, ఊపిరి–సంజీవని అయిన ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలు  ఉద్యమిస్తుంటే– ఆ ఉద్యమాన్ని అణచివేయాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది?

– ఈ ఉద్యమం జీతాలు పెంచాలనో, ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేయాలనో,  స్థానిక సమస్యలను పరిష్కరించాలనో చేస్తున్నది కాదు. ఇది 5కోట్ల ఆంధ్రుల జీవన్మరణ సమస్య. 5 కోట్ల ప్రజల ఆకాంక్షకు సంబంధించి చేస్తున్న ఉద్యమం. అటువంటి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు?

– ప్రత్యేక హోదా ఏమైనా అశ్లీల సాహిత్యమా? ప్రత్యేక హోదా ఉద్యమం ఏమైనా తీవ్రవాద చర్యా? లేక తీవ్రవాద ఉద్యమమా?

– ప్రత్యేక హోదా అన్న పదాన్ని నాలుగేళ్ళపాటు పలకటానికిగానీ, ఆ పదాన్ని వినటానికి కూడా మీరెందు ఇష్టపడలేదు చంద్రబాబు గారూ?

– ప్రత్యేక హోదా అంటే మీకెందురు అంత వ్యతిరేకత?

– ప్రత్యేక హోదా అని రాష్ట్ర ప్రజలు రోడ్ల మీదకు వస్తే.. మీ నాలుగేళ్ళ పార్టనర్‌ కేంద్రంలో ఉన్న బీజేపీ మీకు మొట్టికాయలు వేస్తుందని భయమా?

– ప్రత్యేక హోదా బంద్‌ను విఫలం చేయమని, పోలీసులను ప్రయోగించి ఉక్కుపాదం మోపమని, అణచివేయమని కేంద్రం మిమ్మల్ని ఏమైనా ఆదేశించిందా?
ఇప్పటికీ మీరు కేంద్రం కనుసన్నల్లోనే రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారా? ఇప్పటికైనా ప్రత్యేక హోదాపై మీ విధానం, వైఖరి ఏంటో బయటకు వచ్చి చెప్పండి చంద్రబాబు
గారూ?

– ప్రత్యేక హోదా వస్తే.. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఒక హోదా వస్తుందని, చదువుకున్న విద్యార్థులందరికీ ఉద్యోగాలొచ్చి.. వారంతా తమ కాళ్ళపై తాము
బతుకుతారని మీకు బాధా? రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రాకూడదు. యువత వారికాళ్ళ మీద వారు నిలబడకూడదు. యువత గౌరవంగా బతక కూడదన్నదే మీ
సిద్ధాంతమా? మీ ఇంట్లో మీ ఒక్కగానొక్క కొడుకు లోకేశ్‌ను దొడ్డదారిన ఎమ్మెల్సీ చేసి మీరు మంత్రి ఉద్యోగం ఇచ్చుకున్నారు? మరి రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది
నిరుద్యోగుల సంగతేంటి? వారికి ఉద్యోగాలు అవసరం లేదా?

– ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా? హోదా వస్తే రాష్ట్రానికి ఏమొస్తుంది?  హోదా వేస్ట్‌.. అంటూ గతంలో మీరు చేసిన పనికిమాలిన వాదనలు, ఆ తర్వాత
మీరు తీసుకున్న యూటర్న్‌ల గురించి రాష్ట్ర ప్రజలకు తెలిసిపోతుందని భయమా? 

– అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు, పొద్దున లేచిన దగ్గర  ప్రపంచంలో ఏం జరిగినా మీ ఖాతాలో వేసుకొనే మీరు, నిప్పునని, 40 ఏళ్ళ
ఇండస్ట్రీ అని చెప్పుకొనే మీరు ప్రత్యేక హోదా విషయంలో గోతిలో పడిన విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలిసిపోతుందేమో అన్న భయమా?

 – ఇంతకీ మీరు ప్రత్యేక హోదాకు అనుకూలమా? వ్యతిరేకమా? అనుకూలమైతే ఈ ప్రజా బంద్‌ను ఎందుకు అణచివేస్తున్నారు? మీకు ప్రజల
ఆకాంక్షలు, వారి భవిష్యత్తు అక్కర్లేదా? ఎంతసేపటికీ రాజకీయాలు, లాలూచీలే కావాలా?

– ఇకనైనా మారండి చంద్రబాబు గారూ.. లేకపోతే ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో మీరు ఒక చరిత్ర హీనుడిగా, ప్రత్యేక హోదా ద్రోహిగా మిగిలిపోతారు.

-  ప్రత్యేక హోదా అని నినదిస్తే.. అలాంటివారు చంద్రబాబు గారికి సంఘ విద్రోహ శక్తుల్లాగా, తీవ్రవాదుల్లాగా, విధ్వంసకారుల్లాగా కనిపిస్తున్నారా?

– గతంలో కూడా బీజేపీతో అధికారంలో అంటకాగే సమయంలోనూ చంద్రబాబు ఇదే విధంగా ప్రవర్తించారు. ప్రత్యేక హోదా కోసం జగన్‌ గారు
యువభేరీలు నిర్వహిస్తే.. పిల్లల్ని పంపిచొద్దని తల్లిదండ్రులకు హెచ్చరికలు, కాలేజీలకు నోటీసులు జారీ చేశారు. ప్రత్యేక హోదా అంటే.. ఏకంగా జైలుకి
పంపిస్తానని హెచ్చరించారు ఇదే చంద్రబాబు.

– ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. హోదా అంటే  పంపండి.. అని పోలీసులను ఆదేశాలిస్తున్నట్టు ఉంది చంద్రబాబు తీరు.

-  స్వాతంత్య్ర పోరాటంలో చంద్రబాబు లాంటి వాళ్ళు ఉన్నటై్టతే– మన దేశానికి  అసలు స్వాతంత్య్రమే వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే మనలోనే ఒకరిగా ఉంటూ..
మన గాలి పీలుస్తూ.. బ్రిటీష్‌ వాళ్ళతో లోపాయికారీ ఒప్పందం చేసుకొని మన వాళ్ళతోనే, మన కత్తితోనే మనల్ని వెన్నుపోటు పొడవగలిగిన నాయకుడు
చంద్రబాబు. చంద్రబాబు వెన్నుపోటు నైజం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో దుష్టాంతాలు ఉన్నాయి.

-  చంద్రబాబు వల్లే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాలేదు. చంద్రబాబు అమ్ముడు పోవటం, తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను బలి పెట్టడం వల్లే
ఈరోజుకీ ప్రత్యేక హోదా కోసం ప్రజలు రోడ్డెక్కి పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. 

బంద్‌ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులు, హౌస్‌ అరెస్టులు
విశాఖలో బొత్స సత్యనారాయణ
తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి
ఏలూరులో వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ళ నాని
కడపలో ఎమ్మెల్యే అంజద్‌ భాషా
ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి
సత్తెనపల్లిలో అంబటి రాంబాబు
నగరిలో ఎమ్మెల్యే రోజా
ప్రొద్దుటూరులో రాచమల్లు శివప్రసాదరెడ్డి
గుంటూరులో మోపిదేవి వెంకట రమణ, ముస్తఫా, అప్పిరెడ్డి, కృష్ణదేవరాయలు,
మేరుగ నాగార్జున, జంగా కృష్ణమూర్తి.
నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
విజయవాడలో పార్థసారథి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి, వంగవీటి రాధా
శ్రీకాకులంలో ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారామ్‌
కడపలో వైయస్‌ వివేకానందరెడ్డి
రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి
అనంతపురంలో అనంత వెంకట్రామిరెడ్డి హౌస్‌ అరెస్ట్‌
ఎ్రరగొండపాలెంలో ఆదిమూలపు సురేష్‌
ఒంగోలులో బత్తుల బ్రహ్మానందరెడ్డి, టీజేఆర్‌ సుధాకర్‌ బాబు హౌస్‌ అరెస్ట్‌
కర్నూలులో బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి
మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
విజయనగరంలో ఎమ్మెల్సీ కొలగొట్ల వీరభద్రస్వామి, చిన్న శ్రీను
మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి
కర్నూలులో గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యే చరిత హౌస్‌ అరెస్ట్‌
పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌
కొత్తపేటలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి
అమలాపురంలో విశ్వరూప్‌
నెల్లూరులో మాజీ ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యే సంజీవయ్య, కాకాని గోవర్థనరెడ్డి
పెడనలో జోగి రమేష్‌
రాజంపేటలో ఆకేపాటి అమర్నాథ్‌ రెడ్డి
పీలేరులో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
ఆళ్ళగడ్డలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌ రెడ్డి
రాయదుర్గంలో కాపు రామచంద్రా రెడ్డి
తణుకులో కారుమూరి నాగేశ్వరరావు
కొవ్వూరులో తానేటి వనిత
పోలవరంలో తెల్లం బాలరాజు
కమలాపురంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి
గంగాధర నెల్లూరులో నారాయణ స్వామి.. తదితర పార్టీ నేతలను అరెస్టు చేశారు . 
Back to Top