ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి ప‌రామ‌ర్శ‌

కోవూరు: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండ‌ల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గాజుల మ‌ల్లికార్జున్ తండ్రి దామోద‌రం అనారోగ్యంతో మృతి చెందారు. విష‌యం తెలుసుకున్న పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, నెల్లూరు జిల్లా సీనియ‌ర్ నేత న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి మ‌ల్లికార్జున్ నివాసానికి చేరుకొని కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. దామోద‌ర్ భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పించారు. అనంత‌రం నిర్వ‌హించిన అంత్య‌క్రియ‌ల్లో ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయ‌న వెంట పార్టీ నేత‌లు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కొండ్రెడ్డి రంగారెడ్డితో పాటు, మండల కన్వినర్‌ నలుబోలు సుబ్బారెడ్డి, జిల్లా పార్టీ నాయకులు మల్లికార్జునరెడ్డి, వీరిచలపతి, జనార్థన్‌రెడ్డిలు ఉన్నారు. 

Back to Top