అసెంబ్లీని ఎన్టీఆర్ భవన్ లా మార్చేశారు

నెల్లూరు: స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లా మార్చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్, ఇతర కుంభకోణాలపై చర్చ జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు బండారం బయటపడుతుందనే స్పీకర్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ హోదాలోని వ్యక్తి ఇలా ప్రవర్తించడం శోచనీయమన్నారు.

అధికారపక్షానికి పూర్తి అనుకూలంగా, పక్షపాతపూరితంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షనేతకు కనీసం మైక్ కూడా ఇవ్వనందుకు నిరసనగా స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై వైఎస్సార్సీపీ అవిశ్వాసం అస్త్రాన్ని ప్రయోగించింది.
Back to Top