మునగపాక అభివృద్దిలో ప్రసాద్‌ కృషి అభినందనీయం

మునగపాక: మునగపాక గ్రామాభివృద్దికి కార్యదర్శి మళ్ల ప్రసాద్‌ అందించిన సేవలు మరువరానివని వైయస్‌ఆర్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్‌ అన్నారు. గ్రామసమస్యలపై నిరంతరం శ్రమించే ప్రసాద్‌ పదవీ విరమణ కార్యక్రమంలో బొడ్డేడ ప్రసాద్‌ పాల్గొన్నారు. స్థానిక రాహుల్‌గాంధీ కళ్యాణమండపంలో మునగపాక పంచాయతీగా పనిచేసి పదవీ విరమణ చేసిన మళ్ల శివశంకర్‌ ప్రసాద్‌కు ఘన సత్కారం నిర్వహించారు. ఈసందర్బంగా ప్రసాద్‌ మాట్లాడుతూ అంకితభావంతో పనిచేసే అధికారులకు గుర్తింపు ఉంటుందన్నారు. విధి నిర్వహణలో లోటుపాట్లు లేకుండా అటు ప్రజలకు, ఇటు అధికారులకు మధ్య వారధిగా పనిచేయడంలో ప్రసాద్‌ కృషి చేశారన్నారు. ప్రసాద్‌ పంచాయతీ కార్యదర్శిగా వచ్చిన తరువాత మునగపాక అభివృద్ది సా«ధించిందన్నారు. పాలకవర్గంతో సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలపై స్పందించే ప్రసాద్‌ అందరికీ ఆదర్శం కావాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ పోలిసన్యాశిరావు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు టెక్కలి కొండలరావు, ఎంపీటీసీ టెక్కలి పరశురామ్, మాజీ జెడ్‌పీటీసీ మళ్ల సంజీవరావు,అనకాపల్లి మండలం గొలగాం సర్పంచ్‌ సూరిబాబు,  బీజేపీ నాయకులు బద్దెం సూర్యనారాయణ, పంచాయతీ పాలకవర్గ సభ్యులు మళ్ల కృష్ణ, ఆడారి కాశీబాబు, వేగి కృష్ణ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ప్రసాద్‌ను ఘ«నంగా సత్కరించారు.

Back to Top