ఎన్‌ఎంయూ చైర్మన్‌ ప్రసాదరావు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక


  
 పశ్చిమగోదావరి :  ఏపీఎస్‌ఆర్టీసీ నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌(ఎన్‌ఎంయూ)రాష్ట్ర చైర్మన్‌  ఆర్‌వీవీఎస్‌డీ ప్రసాదరావు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.   ప్రజాసంకల్పయాత్ర చేసిన వైయ‌స్ఆర్‌ సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ప్రసాదరావుకు పార్టీ కండువా వేసి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి సాద‌రంగా ఆహ్వానించారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాల కారణంగానే ఆర్టీసీ  నష్టాల్లో కూరుకుపోయిందని, వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే పూర్వ వైభవం వస్తుందని, కార్మికులకు న్యాయం జరుగుతుందని ప్రసాద్‌ పేర్కొన్నారు.  వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు వైయ‌స్ఆర్‌సీపీకి మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు.

పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోడూరి శివరామకృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీకి చెందిన సానుభూతిపరులు వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. క్లాస్‌–1 కాంట్రాక్టర్‌ బేతిన ప్రసాద్, బీజేపీ కిసాన్‌ మోర్చ జిల్లా కార్యదర్శి దేవగుప్తాపు లక్ష్మణరావు, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి సలాది సందీప్‌కుమార్, బీజేపీ పట్టణ బీసీ మోర్చ అధ్యక్షుడు బత్తుల నాగరాజు, రియల్‌ ఎస్టేట్‌ నిర్వాహకుడు కంఠమణి రమేష్‌బాబు, వెలగల శ్రీకాంత్‌రెడ్డి, వెలగల ప్రవీణ్‌రెడ్డి, గాడి విజయ్‌కుమార్, నరహరిశెట్టి నరసింహ, గూట్ల అశోక్, పెరుమళ్ల సురేంద్ర రాజ్‌కుమార్, దేవగుప్తాపు శ్రీనివాస్, రిటైర్డు ఏఎస్సై గోళ్ల, వెంకటేశ్వరరావు, ఆదాడి బంగార్రాజులతో పాటు 28 మంది వైయ‌స్ఆర్‌సీపీ లో చేరారు. జగన్‌మోహన్‌రెడ్డి వీరికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ చేరికలతో పార్టీ మరింత బలోపేత కానుందని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత తెలిపారు.
Back to Top