వైఎస్ జగన్ దిగ్ర్భాంతి..!

ప్రకాశంః ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. విషాద సంఘటనకు సంబంధించి పార్టీనేతలు వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడితో  జగన్ ఫోన్ లో మాట్లాడారు. బాధితులకు అండగా నిలవాలని వైఎస్ జగన్ పార్టీశ్రేణులను ఆదేశించారు.మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కుటుంబసభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

జిల్లాలోని చెర్లోపాళెం శివారులో శ్రీకృష్ణ ట్రావెల్ బస్సు పెళ్లి వ్యాన్ ను ఢీకొట్టింది. ఈదుర్ఘటనలో 15 మంది అక్కడిక్కడే మృతి చెందగా, మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. గుడ్లూరు మండలం చేవూరు నుంచి పెళ్లి బృందం డీసీఎంలో మానకొండలో ఆలయానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  క్షతగాత్రులను కందుకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
Back to Top