ప్ర‌కాశం జిల్లా ప్లీన‌రీ స‌మావేశం ప్రారంభం

ప్ర‌కాశంః ఒంగోలు ప‌ట్ట‌ణం రామ‌న‌గ‌ర్‌లోని శ్రీ‌సీతారామ ఫంక్ష‌న్‌హాల్ (మినీ స్టేడియం ఎదురుగా) నందు ప్ర‌కాశం జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశం ప్రారంభ‌మైంది. కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా అధ్య‌క్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ నేత‌లు హాజ‌ర‌య్యారు. ముందుగా బాలినేని మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ప్లీన‌రీకి జిల్లా వ్యాప్తంగా ఉన్న వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

Back to Top