అధైర్య పడొద్దు.... అండగా ఉంటా

రాప్తాడుః అనారోగ్యంతో బాధపడుతున్న రాప్తాడు మాజీ ఎంపీపీ మాన్లుకొసే చెన్నమ్మ భర్త, మాజీ సర్పంచు మాన్లుకోసే బలరాముడును రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి శుక్రవారం ఆయన నివాసంలో పరామర్శించారు. బలరాముడు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో చూపించుకుంటున్నారు. గత నెల కిత్రం ఎలూరులో కూడా చూపించుకున్నారు. గత రెండు రోజుల క్రితం ఆయన రాప్తాడుకు వచ్చారు. బలరాముడు రాప్తాడుకు వచ్చిన విషయాన్ని మండల వైఎస్సార్‌ సీపీ యూత్‌ కన్వీనర్‌ చిట్రేడ్డి సత్య నారాయణరెడ్డి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో శుక్రవారం రాప్తాడుకు చేరుకున్న తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి.. నేరుగా బలరాముడు ఇంటికి వెళ్లి పరామర్శించారు. దాదాపుగా రెండు గంటల పాటు బలరాముడుతో కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బలరాముడు అన్న మా నాన్నకు సుపరిచితుడని, గతంలో జరిగిన ఎన్నికల్లో పార్టీ కృషికి ఎంతో కృషి చేశాడని తెలిపారు. ఆయన మరింత కాలం ఆయుద ఆరోగ్యాలతో జీవించాలని దేవున్ని ప్రార్థించారు. తమకు ఏ ఆపద వచ్చినా ఎళ్లవేళాలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

అబద్ధాల బాబును సాగనంపుదాం ః దొంగ హామీలతో అధికారంలోకి వచ్చి, అబద్ధాల పాలన చేస్తున్న సీఎం చంద్రబాబును సాగనంపాలని, టీడీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్ర ప్రజల్ని విముక్తుల్ని చేద్దామని రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ ఎంపీపీ చెన్నమ్మ భర్త మానుకొసే బలరాముడును పరామర్శించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు, జిల్లాలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత కోట్ల రుపాయలు దోచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబునాయుడు అమరావతి పేరు చెప్పుకుంటూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని విమర్శించారు. ఎనిన్కల సమసయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రైతులకు, డ్వాక్రా సంఘాల మహిళలకు అన్యాయం చేశారన్నారు. సన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పక్కా గృహాలు, రేషన్‌ కార్డులు, పింఛన్లు అర్హులకు అందించకుండా, ఒక ధర నిర్ణయించి అమ్ముకుంటున్నారని ఇలాంటి పరిస్థితి నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత వైఎస్సార్‌ సీపీ తీసుకుందని ఆయన చెప్పారు. ఎన్నికల సమయంలో మంత్రి పరిటాల సునీత ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. అధికారంలోకి వస్తే పేరూరు డ్యాంకు నీటిని తీసుకోస్తామని చెప్పి మూడేళ్లు అవుతున్న ఆ సంగతే మరచిపోయిందన్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకు రావచ్చని తెలిపారు. అలా కాకుండా మంత్రి పేరూరు డ్యాంకు నీటిని అందించేందుకు దాదాపుగా రూ.1,100 కోట్లతో అంచనాలు తయారు చేశారని, ఇదంతా మంత్రి పరిటాల సునీత దోచుకునేందుకేనని అన్నారు. మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేదల కొసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపడితే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం వాటిని నీరుగార్చిందన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే మహానేత చేపట్టిన పథకాలన్నీ సక్రమంగా అమలవుతాయన్నారు. వచ్చే ఏడాది చివరిలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, టీడీపీ నాయకుల వద్ద నీరు–చెట్టులో అక్రమంగా సంపాందించిన డబ్బు ఉందని వైఎస్సార్‌ సీపీ శ్రేణులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు. నిజాయితీ మనల్ని గెలిపిస్తుందన్నారు. వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకుని ప్రజల కష్టాలు తీర్చాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని పేర్కొన్నారు. ఆయన వెంట మండల కన్వీనర్‌ బోయ రామాంజినేయులు, యూత్‌ మండల కన్వీనర్‌ చిట్రేడ్డి సత్యనారాయణరెడ్డి, మండల నాయకులు పూలకుంట శివారెడ్డి, కురుగుంట మాధవరెడ్డి, ఎలకుంట్ల అమర్‌నాథ్‌రెడ్డి, సునిల్‌దత్తరెడ్డి, దండురామాంజినేయులు, జూటూరు శేఖర్, నారాయణ, గోవిందరెడ్డి, అక్కుల్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, కేశవరెడ్డి, నరసింహులు, మాధవరెడ్డి, క్రిష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.




Back to Top