సీఈసీ సభ్యుడిగా ప్రకాశ్ నియామకం

హైదరాబాద్‌: వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి (సీఈసీ) సభ్యుడిగా నాయుడు ప్రకాశ్‌ నియమితులయ్యారు.  వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ గట్టు శ్రీకాంత్‌రెడ్డి సీఈసీ సభ్యునిగా నాయుడు ప్రకాశ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. తనపై పార్టీ పెద్దలు ఉంచిన నమ్మకానికి నాయుడు ప్రకాశ్‌ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

తాజా ఫోటోలు

Back to Top