ఘ‌నంగా ప్ర‌కాశం జిల్లా ఆవిర్భావం దినోత్స‌వం


ఒంగోలు: ప‌్ర‌కాశం జిల్లా 48వ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఒంగోలు ప‌ట్ట‌ణంలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో గురువారం స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం చిత్ర‌ప‌టానికి వైయ‌స్ఆర్‌సీపీ న‌గ‌ర అధ్య‌క్షులు కుప్పం ప్ర‌సాద్‌, నాయ‌కులు గంటా రాము, ఓబుల్‌రెడ్డి, కావూరి సుశీల త‌దిత‌రులు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.  ఫిబ్రవరి 2,1970వ తేదీన, నెల్లూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల నుంచి కొంత భాగం వేరే చేసి ప్ర‌కాశం జిల్లాగా ఆవిర్భవించింది. తరువాత డిసెంబర్ 5,1972వ తేదీన, జిల్లాలోని కనుపర్తి గ్రామములో పుట్టిన గొప్ప దేశభక్తుడు, ఆంధ్ర నాయకుడైన, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్ధము ప్రకాశం జిల్లాగా నామకరణము చేశారు. జిల్లా అభివృద్ధిని టీడీపీ ప్ర‌భుత్వం విస్మ‌రించింద‌ని, జిల్లాలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌పై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోరాడుతున్నార‌ని తెలిపారు, పార్టీ జిల్లా అధ్య‌క్షుడు బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డిల స‌హ‌కారంతో పార్టీని బ‌లోపేతం చేస్తున్నామ‌ని కుప్పం ప్ర‌సాద్ తెలిపారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ న‌గ‌ర నాయ‌కులు పాల్గొన్నారు.
Back to Top