డయేరియాతో 20 మంది మృతి.. ఇది బాబుగారి హైటెక్కు పాలన

గుంటూరు: ‘‘పక్కనే కృష్ణా నది తాగడానికి మాత్రం నీళ్లు దొరకవు. గోతులు తవ్విన కాలువలకే పరితమైన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ. తాగుతున్నవి మంచినీళ్లు..మురికినీళ్లో తెలియని పరిస్థితి. మురికినీళ్లు తాగి డయేరియా 20 మంది చనిపోయిన దౌర్భాగ్య స్థితి. ఇది బాబుగారు చెప్పుకునే హైటెక్కు పాలన’’ అని ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న వైయస్‌జగన్‌ ఈ రోజు గుంటూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వైయస్‌ జగన్‌ ఏ మాట్లాడారో పూర్తి ప్రసంగ పాఠం...

గుంటూరు నగరంలో అడుగు పెడుతూనే ఇక్కడ ప్రజలు చెబుతున్న సమస్యలు వింటున్నప్పుడు బాధేసింది. గుంటూరుకు కొద్ది దూరంలోనే సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ కనిపిస్తుంది. తన కల్ల ఎదుటనే గుంటూరు ఇంత దారుణమైన పాలన జరుగుతుంటే బాబు పట్టించుకోకపోవడంపై కోపం వచ్చింది. బాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతోంది. గుంటూరులో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కోసం తవ్విన కాలువలుఅలాగే ఉన్నాయి. కనీసం 20 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. అంతేకాదు బాబు ఏ ముహూర్తాన పాలన మొదలు పెట్టారోగానీ గుంటూరులో డయేరియాతో 20 మందికి పైగా చనిపోయారు. ఇది బాబుగారి హైటెక్కు పాలన. డయేరియాతో ప్రజలు చనిపోతుంటే వాళ్లను బతికించుకోలేకపోయిన దౌర్భాగ్య ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక్కడి ప్రజలు తాగుతున్నవి మంచినీళ్లో..మురుగునీళ్లో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక్కడి గుంటూరు జనరల్‌ హాస్పిటల్‌ (జీజీహెచ్‌)లో వాళ్ల అధికారిక లెక్కల ప్రకారం డయేరియాతో 20 మంది చనిపోయారని చెబుతుంటే గుంటూరులోపరిస్థితి ఎలా ఉందో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. డయేరియాతో చనిపోయిన వారికి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు పరిహారం ఇస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కానీ ఇచ్చింది ఎంతమందికో తెలుసా? కేవలం 6 మందికి మాత్రమే. డయేరియాతో 20 మంది చనిపోతే ఇచ్చింది మాత్రం కేవలం 6 మందికి.  ఎక్కువ మంది చనిపోయారని ఒప్పుకుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని చెప్పి 6 మందికి ఇచ్చి మిగతావాళ్లను గాలికి వదిలేశారు. 

అంతేకాదు ఇదే జీజీహెచ్‌లో 10 రోజుల వయస్సున్న చిన్నారిని ఎలుకలు కొరికి చంపాయి. ఇలాంటివి గతంలో మనం ఎప్పుడన్నా విన్నామా.. బాబుగారు వచ్చాక ఇలాంటివి వినాల్సి వస్తోంది. అంతేనా.. జీజీహెచ్‌లో పాములు కనిపిస్తున్నాయి. పిల్లలు కిడ్నాప్‌ అవుతున్నారు. విద్యుత్‌ పోతే జనరేటర్లు లేక సెల్‌ఫోన్‌ లైటింగ్‌లో ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా బాబులో చలనం లేదు. ఇంతటి దారుణమైన ముఖ్యమంత్రి బహుశా ప్రపంచంలోనే ఎక్కడా ఉండడు. 

గుంటూరుకు కూతవేటు దూరంగా సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ ఉన్నా.. నగరానికి మాత్రం నీళ్లు ఇవ్వడం లేదు. ఇచ్చేనీళ్లు కూడా రోజుకు గంటే మాత్రమే ఇస్తున్నారు. శివారు ప్రాంతంలో రెండు రోజులకు ఒకసారి ఇస్తున్నారు. ప్రక్కనే కృష్ణా నది ఉన్నా నీళ్లు దొరకడం లేదు.. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఉంటుందా? ప్రతిదీ కూడా అవినీతిమయమే.. ప్రతిదీ స్కాంలే.. పేదవాడి ఇళ్లను కూడా వదిలిపెట్టడం లేదు. పేదవాడికి ప్లాట్లు అని కట్టిస్తున్నాడు. ఆ పేదవాడికి 300 అడుగుల ప్లాట్‌ రూ.6లకు అమ్ముతాడట. జీ ప్లస్‌ త్రీ గా కట్టించి ఆ ఇళ్లు అడుగుకు రూ.2000లు తీసుకుంటున్నాడు. మామూలుగా అయితే అడుగుకు రూ.1100ల కంటే మించదని బిల్డర్లు అంటున్నారు. రూ.3 లక్షల ఖర్చు అయ్యే ప్లాటును రూ.6 లక్షలకు అమ్ముతున్నాడు. రూ.3 లక్షలు ప్రభుత్వం ఇస్తుందట.. మరో రూ.3 లక్షలు అప్పుగా ఇస్తారట. రూ.3000లు చొప్పున  20 ఏళ్ల పాటు కట్టాలట. ఇదీ చంద్రబాబు పాలనలో స్కాంలు. ఇదే బాబు పాలనలో మనం  ఏం చూస్తున్నామంటే  మోసం చేయడం చూశాం. అబద్ధాలు ఆడడం చూశాం. విచ్చలవిడిగా అవినీతి జరగడం చూశాం. మట్టి నుంచి ఇసుక దాక అవినీతే. పక్కనే ఇదే జిల్లాలోనే విచ్చలవిడిగా శ్యాండ్‌ మాఫియా జరుగుతోంది. దేన్నీ వదిలిపెట్టకుండా స్కాంలు చేస్తున్నారు. ఆఖరికి గుడి భూములను కూడా వదిలిపెట్టడంలే. జన్మభూమి కమిటీలు వేసేపరిస్థితి.. బియ్యం కావాలన్నా లంచం.. చివరికి ఏం కావాలన్నా లంచం.

ఇదే గుంటూరు నుంచి 10 కిలోమీటర్ల దూరం.. పేరేచెర్లలో ఒక సంఘటన జరిగింది. అది చూశాక బాధనిపించింది. ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు చిన్నపిల్లలు చనిపోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ బాధలను చూస్తున్నప్పు నాకు ఒక కథ గుర్తుకు వచ్చింది.
 
అనగనగా పేరేచర్లలో ఒక చిన్న దొంగ ఉండేవాడట.. చిన్న చిన్న బద్ధాలు.. మోసాలు దొంగతనాలు చేసేవాడట. ఒకానొక రోజు ఆ దొంగకు పాపం పండింది. అతను చనిపోయాడు. యమధర్మరాజు ఆ దొంగ దగ్గరికి వచ్చి అతన్ని తీసుకుని పోయేటప్పడు ఆ దొంగ స్వామీ నేను ఏ తప్పు చేశాను? నన్ను ఎందుకు తీసుకుపోతున్నావు? అని అడిగాడట. అదేంటి నువ్వు మోసాలు..దొంగతనాలు చేశావు కదా అని అన్నాడట ఆ యమధర్మరాజు. ఆ దొంగ అన్నాడట. మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా స్వామీ అని అన్నాడట. యమధర్మ రాజు అన్నాడట ఇదిగో ఇటు చూడు నువ్వు ఒక ఇంట్లోకి వెళ్లి రూ.50వేలు దొంగతనం చేస్తుండగా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది అని అన్నాడట. దీంతో దొంగ సరే స్వామీ మీరు ఇది చూడలేదా( ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఫోటో) అన్నాడట.  యమధర్మరాజు అడిగాట... ఏమిటిది అని. ఆ దొంగ అన్నాడట  స్వామీ మా ముఖ్యమంత్రి విచ్చలవిడిగా అవినీతి చేశాడు..చేసిన ఆ సొమ్ముతో ఏం చేయాలో తెలియక ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కోట్లకు కోట్లు కుమ్మరించాడు స్వామి.. ఆడియో టేపులతో వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయాడు స్వామీ.. అయినా కూడా ఆయనకు ఏ శిక్ష లేకుండా దర్జాగా తిరుగుతున్నాడు స్వామీ ఆయనది తప్పు కానప్పుడు నాది తప్పు ఎలా అవుతుంది స్వామీ అన్నాడట. యమధర్మరాజు వెంట నోట మాట రాలేదు. అది సరే నువ్వు మోసాలు కూడా చేశావు కదా అన్నాడట. మరి దొంగ అన్నాడట..నేను ఏం మోసం చేశాను స్వామీ అని అన్నాడట. మీ పక్కింటి వాళ్ల దగ్గర రూ.10వేలు ఇస్తామని చెప్పి తీసుకుని కనిపించకుండా పోయావు కదా అలా చేయడం తప్పు కదా అన్నాడట యమధర్మరాజు. అయితే దొంగ అన్నాడట మరి అయితే స్వామీ ఇది చూడండి (టీడీపీ మేనిఫెస్టో) దొంగ చూపించాడట. దీనిని ఏమంటారని యమధర్మరాజు అడగ్గా స్వామీ దీనిని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అంటారు స్వామీ.. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వామీ ఈ మేనిఫెస్టో రిలీజ్‌ చేస్తూ పవిత్ర గ్రంథమని చెప్పి ప్రమాణం చేసి తర్వాత రైతులు, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పాడు స్వామీ దమ్మిడి కూడా చేయకుండా అందరినీ మోసం చేశాడు సామీ అని దొంగ అన్నాడట. చంద్రబాబు మేనిఫెస్టోలో రైతులందరికీ గిట్టుబాటు ధరలు, రూ.5వేలు కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు స్వామీ, ఇంటికొక ఉద్యోగం అన్నాడు స్వామీ ప్రతి ఇంటికీ కరపత్రం పంచాడు స్వామీ చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టారని ఇచ్చాడు స్వామీ, ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు  అని యమధర్మరాజుకు ఆ దొంగ చెప్పాడట. చెప్పాడట. ప్రతి కులం, వర్గం అందరినీ మోసం చేయడంతో పాటు ప్రత్యేక హోదా విషయంలో కూడా మోసం చేస్తూ..................నే ఉన్నాడు స్వామీ అని దొంగ యమధర్మరాజుకు చెప్పాడట. అంతెందుకులేస్వామీ ఇక్కడే పేరేచర్లలో జరిగిన ఘటన చూడండి  స్వామీ మా ఊరిలో డిసెంబర్‌లో ఆటో యాక్సిడెంట్‌ అయింది. ఈ యాక్సిడెంట్‌లో డ్రైవర్‌తో సహా నలుగురు పిల్లలు చనిపోయారు.. 3 తీవ్రంగా గాయపడ్డారు స్వామీ.. టీడీపీ నాయకులు వచ్చారు స్వామీ అందరూ వచ్చి చనిపోయిన ప్రతి పిల్లాడికి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పారు స్వామీ ఆ తర్వాత గాయపడిని పిల్లలకు రూ.2లక్షలు ఇస్తామని చెప్పారు స్వామీ... ఉచితంగా వైద్యం చేయిస్తామన్నారు స్వామీ .. ఆర్టీసీ బస్సు కాబట్టి ఆటోడ్రైవర్‌ భార్యకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు స్వామీ హామీ ఇచ్చిన మరుసటి రోజునుంచి ఆ మంత్రులు కనిపించలేదు.. టీడీపీ నాయకులు కనిపించలేదు స్వామీ అని దొంగ యమధర్మరాజుతో అన్నాడట. ఆ మాట అంటూ స్వామీ నేను మోసం చేసింది కేవలం రూ.10వేలు మాత్రమే స్వామీ.. దీనికే నన్ను నరకానికి తీసుకుపోతే  5 కోట్ల మంది ప్రజలను మోసం చేసిన బాబుకు ఏ శిక్ష వేయాలని స్వామీ అని ఆ దొంగ యమధర్మరాజుతో అన్నాడట. దొంగ మాటలకు యమధర్మరాజు భయపడ్డాడట. ముఖ్యమంత్రే పెద్ద దొంగ అయితే అయితే  చిల్లర దొంగది తప్పేముందిలే అని ఆ యమధర్మరాజు మాయమయ్యాడట. ఇలా ఉంది బాబు పాలన. 

యాక్సిడెంట్‌లో చనిపోయిన ఆటో డ్రైవర్‌ భార్య త్రివేణి మాట్లాడుతూ నా భర్త ఆటో ప్రమాదంలో చనిపోయాడు.. ఎమ్మార్వో గారు మంత్రులు ఇంటికి వచ్చి ప్రభుత్వం నుంచి డబ్బులు ఇప్పిస్తామన్నారు. నన్నపనేని రాజకుమారి వచ్చి ధర్నా చేసినా సీఎం నుంచి డబ్బులు ఇప్పిస్తామని చెప్పారు. నేను 7 నెలల గర్భవతిని, 12 నెలల పాప ఉంది. నా భర్త సాయంతో నేను ఇన్ని రోజులు బతికాను.  అప్పుడు నాకు ఉద్యోగం ఇప్పిస్తామని, చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదు.  అనంతరం జగన్‌ మరో మహిళను చూపిస్తూ ఇదే ఘటనలో  ఈ తల్లిపిల్లలకు కాలు ఇరిగింది. ఆటో డ్రైవర్‌ భార్యకు రూ.5 లక్షలు, ఉద్యోగం ఇస్తామన్నారు. రెండూ ఎగరకొట్టారు. గాయపడ్డ పిల్లలకు ఆస్పత్రి ఖర్చులుకూడా ప్రభుత్వం పెట్టుకోలేదు. ఆస్పత్రి ఖర్చులు కూడా ఇవ్వలేదు. అనంతరం కాలు ఇరిగిన పిల్లల తల్లి పద్మావతి మాట్లాడుతూ ఒక అమ్మాయి ఒక కాలు ఇరిగిపోయింది. ఇంకొక అమ్మాయి రెండు కాళ్లు ఇరిగిపోయాయి. ఉచితంగా వైద్యం చేయిస్తామన్నారు. రెండు రోజులు చేయించారు. తర్వాత పట్టించుకోలేదు అన్నారు పద్మావతి. అనంతరం వైయస్‌ జగన్‌  మాట్లాడుతూ...కనీసం ఇప్పటికైనా చంద్రబాబుకు బుద్ధిజ్ఞానం ఉంటే వీళ్లకు న్యాయం చేయాలి. ఒకవేల ముందుకు రాకపోతే ఈ అక్క చెల్లెమ్మలకు నేను హామీ ఇస్తున్నా. ఇలాంటి అన్యాయమైన పాలన ఎక్కువ కాలం బతకదు. త్వరగా ఈ ప్రభుత్వం బంగాళాకాతంలో కలుస్తుంది. ఈ కుటుంబాలకు ఒక అన్నలాగా అండగా ఉంటానని హామీ ఇస్తున్నా.  రాష్ట్రంలో జరుగుతున్న ఈ పాలన ఇంత దారుణంగా ఉంది. 
మోసం అన్నది ఈ రోజు క్లైమాక్స్‌కు చేరింది. చంద్రబాబు ఢిల్లీపోవడం విమానం ఎక్కి. నిజంగా ప్రత్యేక హోదాకు వెళ్తున్నట్లు విమానం ఎక్కినట్లు పెద్ద బిల్డప్‌ ఇచ్చారు. అయ్యా చంద్రబాబుగారు ప్రత్యేక హోదా సాధించాలన్న కోరిక నీలో ఉందా అనిఅడుగుతున్నా. మీ తరుపున అడుగుతున్న కేంద్ర ప్రభుత్వంపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టి ఉండకుండా ఉంటే ఈ పెద్దమనిషి పెట్టి ఉండేవాడా అని అడుగుతున్నా.. ఇదే పెద్ద మనిషి మార్చి 15న గురువారం రోజు అసెంబ్లీలో ఈయన అన్న మాటలు ఏమిటి.. సంఖ్యా బలం ఉంటే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామన్నారు. మార్చి 16న యూటర్న్‌ తీసుకున్నారు. ఆ పార్టీకి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టడం.. వాళ్లందరినీ ఒప్పించి మద్దతు ఇస్తున్నారని మీడియాలో వచ్చిన తర్వాత బాబు యూటర్న్‌ తీసుకుని తాను ముందుకు వచ్చి అవిశ్వాసం పెట్టారు కాబట్టి అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయని అంటున్నారు. ఇంత సిగ్గుమాలిన రాజకీయాలా అని అడుగుతున్నా. ఈయన గారి చిత్తశుద్ధి ఎలా ఉందంటే.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఎంపీలందరూ రాజీనామా చేస్తారని, మీరూ రాజీనామా చేయించండి అని పిలుపునిస్తే  మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామా చేయిస్తే ఈ పెద్ద మనిషి రాజీనామాలు చేయడట. మా ఎంపీలు రాజీనామా చేసిన తర్వాత ఏపీ భవన్‌కు పోతారు. నిరాహార దీక్షకు కూర్చుంటారని చెప్పాను. అదే బాటలో టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తే  25 మంది రాజీనామా చేసిన తర్వాత దేశం మొత్తం దాని గురించి చర్చిస్తుంది.. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఉండలేని పరిస్థితి వస్తుందని అడిగితే ఆమరణ దీక్ష గురించి ఊసే ఎత్తరు. ఈ మనిషి తన ఎంపీలతో రాజీనామా చేయించటర. ఆమరణ నిరాహార దీక్షలు చేయించరట. ఈ పెద్దమనిషి తనకు సంబంధించిన ఎంపీతో రాజీనామాలు ఎందుకు  చేయించరో తెలుసా? తన అవినీతిపై కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయిస్తే తన తరఫున ఎంపీలు పోరాటం చేయాలట. అందుకే ఇప్పుడు  ఢిల్లీ పోయారు. కేంద్ర ప్రభుత్వం ఈయన చేసిన అవినీతిపై విచారణ చేపడితే ఈయన తరపున కొన్ని పార్టీలు మాట్లాడాలి అని ఒప్పించుకునేందుకు ఢిల్లీ వెళ్లారు. ఇలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌ను పాలించేందుకు అర్హుడేనా అని అడుగుతున్నా. 

ఇలాంటి అన్యాయాలు చేసే వ్యక్తిని పొరపాటున ఎవరైనా క్షమిస్తే రేపొద్దున ఏం చేస్తాడో తెలుసా? ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తానంటాడు. అలా నమ్మరని, కేజీ బంగారానికి బోనస్‌గా బెంజి కారు ఇస్తానంటాడు. అయినా నమ్మరని తెలుసు ప్రతి ఇంటికీ ఒక మనిషి పంపించి ఓటుకు రూ.3వేలు ఇస్తానంటారు.. అలా అంటే మాత్రం ఓటుకు రూ.5వేలు గుంజండి. ఓటుమాత్రం మీ మనసాక్షిని అడిగి వేయండి. 

ప్రతి పేదవారి ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు నవరత్నాలు పథకాలు ప్రకటించాం. నాన్నగారు ఎప్పుడూ చెబుతుండేవారు పేదరికం పోవాలంటే ఆ కుటుంబం నుంచి కనీసం ఒక్కరైతే పెద్ద పెద్ద చదువులు చదవాలని, అప్పుడే పేద రికం దూరం అవుతుందని. నాన్నగారు ఒక అడుగు ముందు వేశారు. జగన్‌ నాన్నగారి కొడుకుగా రెండడుగులు ముందు వేస్తానని చెబుతున్నా. మీ పిల్లలు ఏం చదువుతారో చదివించండి. ఎంత పెద్ద చదువులైనా చదివించండి ఎన్ని లక్షలు ఖర్చు అయినా భరిస్తాం..ఉచితంగా చదివిస్తాం. అందుకు నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు వారికి లాడ్జింగ్‌ అండ్‌బోర్డింగ్‌ ఖర్చుల కింద ఏటా రూ.20వేలు కూడా ఇస్తా. చిన్న పిల్లలను తల్లిదండ్రులు బడికి పంపించండి. ఆ తల్లులకు ఏటా రూ.15వేలు ఇస్తా. పిల్లలు బాగా చదివితేనే మన తలరాతలు మారుతాయి. మీ బిడ్డను ఆశీర్వదించండి అని కోరుతున్నా..తోడుగా నిలవమని ప్రాధేయపడుతున్నా. మీ చెరగని ఆప్యాతలకు, మీ ప్రేమానురాగాలకు కృతజ్ఞతలు చెబుతున్నా. 
Back to Top