హోదా ఉద్యమం..ఇక ఉధృతం

* పార్లమెంట్‌ చివరి రోజున మన పార్టీ ఎంపీలు రాజీనామా 
* ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహార దీక్ష
* ఎంపీల దీక్షకు మద్దతుగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలేదీక్షలు
* క్యాంపస్‌లలో విద్యార్థులు కూడా రిలేదీక్షలు చేయాలని పిలుపు
*  హోదా పోరుకు అందరూ కలిసి రావాలన్న వైయస్‌ జగన్‌
* పేరేచర్ల బహిరంగ సభలో చంద్రబాబు అవినీతిపై నిప్పులు చెరిగిన జననేత

గుంటూరు: ‘‘ ప్రత్యేక హోదా మన ఊపిరి. మన హక్కు కూడా. హోదా కోసం నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నాం. అయినా కేంద్రం స్పందించలేదు. హోదా ఇవ్వకపోతే పార్లమెంట్‌ చివరి రోజున మన పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారు. అక్కడి నుంచి ఏపీ భవన్‌కు వెళ్లి  ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుకుంటారు. ఎంపీలకు మద్దతుగా మనం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలేనిరాహార దీక్షలు చేపడదాం. విద్యార్థులు కూడా కలిసి రావాలి. క్యాంపస్‌లలో రిలేదీక్షలు చేయాలి. హోదా కోసం అందరం కలిసి పోరాటం చేద్దాం. మన హక్కును సాధించుకుందాం’’ అని తాడికొండ నియోజకవర్గం పేరేచర్ల బహిరంగ సభలో ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. 
పేరేచర్ల బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ఉపన్యాసం పూర్తి పాఠం...   
ఇక్కడి ప్రజలు, రైతన్నలు నాకు చెప్పిన విషయాలు.. అన్నా.. ఇదిగో అన్నా.. పక్కనే సీఎంగారి క్యాంప్‌ ఆఫీస్‌ ఉందన్నా.. ఆ సీఎంగారి క్యాంప్‌ ఆఫీస్‌ ఇక్కడికి  500 గజాల దూరం కూడా ఉంటుందో లేదో తెలియదు అన్నా.. విచ్చలవిడిగా ఇసుక తోలేస్తున్నారన్నా.. దోచేస్తున్నారన్నా.. సీఎం గారి కళ్లెదుటే తోడేస్తున్నారని ఫోటోలు ఇస్తున్నారు.. డ్రెడ్జింగ్‌ మిషన్లు పెట్టి తోలుతున్నారని చెబుతున్నారు. బోరుపాలెం..వెంకటాయపాలెం..ఉద్దండరాయపాలెంలో వేల లారీలు తోలుతున్నారు. ఇసుక మాఫియాకు నాయకుడు ఎవరు? అని అడుతున్నా. ఎమ్మెల్యేలు..చినబాబుగారితో మాట్లాడుకుంటారు. ఎమ్మెల్యేల దగ్గర నుంచి కలెక్టర్ల దగ్గర వరకు లంచాలు.. చినబాబు దగ్గరినుంచి పెద్దబాబుగారి వరకు లంచాలే. ముఖ్యమంత్రి గారికి భాగస్వామ్యం లేకుండానే ఇసుర తరలింపు జరుగుతుందా అని అడుగుతున్నా. 
అన్నా..రాజధాని కోసమని చెప్పి బలవంతంగా మా భూములు తీసుకున్నారన్నా అని చెప్పారు. గజం రెండు లక్షలు..మూడు లక్షలు పోతుందని చెప్పారు.. ఈ రోజు మా పరిస్థితి ఏంటన్నా అని అడుగుతున్నారు.. మాయా బజారు సినిమా..ఇంద్రలోకం చూపిస్తున్నారు..  ప్రత్యేక విమానాల్లోదేశాలు తిరుగుతున్నారన్నా అని అంటున్నారు. బాహుబలి సినిమా సెట్టింగులు అంటారన్నారు. సింగపూర్‌లా రాష్ట్రాన్ని మార్చేస్తానని చెబుతాడన్నారు.
ఏ దేశానికి పోతే ఆ దేశంగా మార్చేస్తానని చెప్పి సినిమా చూపిస్తున్నారు. నాలుగేళ్లు అవుతోంది.. 40 అంతస్తుల బిల్డింగ్‌ ఏమోకానీ... 4 అంతస్తుల బిల్డింగ్‌ కూడా లేదు.. పర్మినెంట్‌ పేరుతో ఒక్క ఇటుక కూడా పడలేదు. రోడ్డులేదు..కరెంటు..లేదు.. ఏ రకంగా ప్లాట్లు అమ్ముకోవాలని అడుగుతున్నారు.  పేదవాళ్ల దగ్గరికి వచ్చి అసైన్డ్‌ భూములు, లంక భూములు బలవంతంగా లాక్కున్నారు. నిజంగా ఇన్ని అబద్ధాలు..మోసాలు..అవినీతి జరుగుతుంటే గమనించమని అడుగుతున్నా. రాజధాని పేరుతో చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు. ఇదే పెద్ద మనిషి రాజధాని అన్నది ప్రజల కోసం కట్టడం లేదు. రాజధాని పేరుతో లంచాలు కోసమే కడుతున్నారు. 2014 మేలో ప్రభుత్వం వచ్చింది. రాజధాని ఎక్కడ కడుతున్నది బాబుకు తెలుసు. తెలిసినా ఎవరికీ చెప్పలేదు. చెప్పకపోగా.. ఈ మనిషి ప్రజలను మభ్య పెట్టేందుకు నూజివీడు ప్రాంతంలో రాజధాని అని ఒకసారి, నాగార్జున యూనివర్శిటీవైపు వస్తోందని మరోసారి చెబుతారు.. రాజధాని ఇక్కడ రావడం లేదు అక్కడ వస్తోందని రైతన్నలు అనుకుంటున్న పరిస్థితుల్లో తన బినామీలను రంగంలోకి దింపి కోట్లు విలువ చేసే భూములను శనక్కాయలకు..బెల్లాలకు కొనుక్కునే పరిస్థితి తెచ్చారు. ముఖ్యమంత్రి అనేవారు నా ప్రజలు బాగుపడాలని అనుకుంటారు. రైతన్నలను భూములు అమ్ముకోవద్దని సలహా ఇస్తారు. ఈ పెద్దమనిషి మాత్రం తన బినామీలను పంపించి వేల ఎకరాలను తక్కువ ధరలకు కొనుగోలు చేస్తారు. డిసెంబర్‌ చివరిలో రాజధాని ఇక్కడే వస్తోందని చెప్పి తన బినామీలు భూములు కొన్నాక ప్రకటిస్తారు. చంద్రబాబు ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరించారా? రియల్‌ఎస్టేట్‌ బ్రోకర్‌గా వ్యవహరించారా?. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేశారు.  జైల్లో పెట్టకూడదా అని అడుగుతున్నా.  ఆ బినామీల భూములను ముట్టుకోకుండా మిగిలిన రైతుల భూములను ల్యాండ్‌పూలింగ్‌లోకి తీసుకువచ్చారు. పేదవాడికి..రైతులకు దిక్కుదివాణంలేని చోట్ల ప్లాట్లు. బినామీలకు మాత్రం చుట్టూపార్కులు..చుట్టూ రోడ్లు ఉన్న చోట ప్లాట్లంట.
రైతులను టార్గెట్‌ చేస్తారు.. ఎవరైతే భూములు ఇవ్వమంటారో రైతుల పొలాలను దగ్గరుండి తగలబెట్టిస్తారు.. అరటి తోటలను దున్నేయిస్తారు. ప్రజలను పోలీస్‌ స్టేషన్‌లో పెట్టి భయపెట్టి భూములు లాక్కుంటారు. నాలుగేళ్లుగా అన్యాయం చేస్తూ పోతారు.. ఎవరైనా ప్రశ్నిస్తే వీళ్లు రాజధానికి వ్యతిరేకం అని బండ వేస్తారు. కృష్ణ. గుంటూరు జిల్లాలను జోనింగ్‌ చేశారు.. బినామీలకు లాభం చేశారు.. రైతుల భూములను మాత్రం వ్యవసాయ భూముల క్రింద పెడతారు. వాళ్లు అమ్ముకునే వీలుండదు. ఇంత దారుణంగా చేస్తున్నారు. రాజధాని పేరు చెప్పి 22 సార్లు విదేశాలకు వెళ్లారు. ఈయన అక్కడకి వెళ్లినప్పుడల్లా.. బుల్లెట్‌ ట్రైన్‌ వచ్చేస్తోందని.. ట్యూబ్‌ రైల్‌..ఎయిర్‌ బస్‌..మైక్రోసాఫ్ట్‌.. 100 అంతస్తుల బిల్డింగ్‌ అంటూ ఎల్లోమీడియాలో రాయిచ్చేస్తారు.. అదిగో అమరావతి..అదిగో బిల్డింగ్‌ అంటారు. ఆ రకంగా ఏమేమో జరిగిపోతున్నాయని చెప్పిస్తారు. తనకు నచ్చిన వాళ్లకు ఇష్టానుసారంగా భూములను పంపిణీ చేస్తారు. 
రాజధానిలో బాబు చేస్తున్న మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయో గమనించమని అడుగుతున్నా.. ఒక్క ఇటుక కూడా పర్మినెంట్‌ బిల్డింగ్‌కు పడలేదు. ఏది చూసినా టెంపరరీనే. టెంపరరీ సెక్రటేరియట్‌కు, అసెంబ్లీ కట్టేందుకు అడుగుకు రూ.10వేలు ఇచ్చారు. ఇంత దారుణమైన స్కామ్‌ దేశంలో ఎక్కడా జరగలేదు. అసలు రాజధాని కట్టే ఉద్దేశం ఉందా అని బాబును అడుగుతున్నా. అడుగుకు రూ.10వేలు ఖర్చు చేసి టెంపరరీ బిల్డింగ్‌లు కడతారా.. అదే డబ్బుతో పర్మినెంట్‌ బిల్డింగ్‌లు కట్టవచ్చు కదా? రాజమౌళిని పిలిపించి ఆర్కిటెక్చర్‌ వర్క్‌ ఇచ్చాడు. ఏది ఎవరికి ఇవ్వాలో కూడా తెలియదు బాబుకు. చంద్రబాబు ఏపీకి సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ ఇల్లు కట్టుకోకుండా హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్నాడు. అసలు ఆయకే ఇక్కడ ఉండాలని లేదు. ఇక ప్రజలకు పర్మినెంట్‌ బిల్డింగులు ఎందుకులే అనుకుంటున్నాడు.  తాను సొంతంగా ఇల్లు కట్టుకోడు.  ఇల్లు కొనుక్కోడు. కానీ హైదరాబాద్‌లో మాత్రం రాజభవనం పెట్టుకుంటారు. ఇల్లు ఇక్కడ కట్టుకుంటారా అని అడుగుతున్నా. రాజధాని కట్టే ఉద్దేశం చంద్రబాబుకు ఉందా? అని అడుగుతున్నా.. నాలుగేళ్లుగా ఇదే జరుగుతోంది. తాను చేసింది ఏంటని అడుగుతున్నా. రాజధాని పేరుతో భూములతోవ్యాపారం చేశారు. తాను చేసింది.. తన జేబులు ఎలా నింపుకోవాలని చేశాడు తప్పితే.. ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరగాలని ఒక్కటి కూడా చేయలేదు. 
ఎన్నికలప్పుడు ఇదే పెద్దమనిషి  బ్యాంకుల్లో పెట్టిన బంగారు, రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేశాడు. . బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా? అని అడుగుతున్నా. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఒక్క రూపాయి అయినా మాఫీ అయిందా అని అడుగుతున్నా. రైతులకు వడ్డీలకు కూడా సరిపోలేదు. గత ప్రభుత్వం వడ్డీలేకుండా రైతులకు, పొదుపు సంఘాల మహిళలకు డబ్బులు ఇచ్చింది. ఈ పెద్దమని సీఎం అయ్యాక బ్యాంకులకు డబ్బులు కట్టడమే మానేసిన పరిస్థితిని చూశాం.
ఆ రోజు ఏమన్నాడు.. జాబు కావాలంటే బాబు రావాలన్నాడు. జాబు ఇవ్వకపోతే రూ.2000లు ఇస్తామన్నారు. 48 నెలలకు అవుతోంది.. ప్రతి ఇంటికీ 96వేలు బాకీ పడ్డారాలేదా అని అడుగుతున్నా.. బాబూ 96వేల పరిస్థితి ఏంటి అని అడగండి.  నాలుగేళ్ల పాలన ఒక్కసారి చూడండి. పిల్లలు తాగి చెడిపోతున్నారన్నారు. అధికారంలోకి వస్తే బెల్టుషాపులు తీసేస్తానన్నారు. మద్యాన్ని తగ్గిస్తానన్నారు. ఈ రోజు నాలుగేళ్ల తర్వాత అడుగుతున్నా ఏదైనా గ్రామంలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఉందోలేదో తెలియదు కానీ.. మందుషాపు లేని గ్రామం లేదు.  ఫోన్‌ కొడితే మినరల్‌ వాటర్‌ వస్తుందో రాదో తెలియదు కానీ.. మందు బాటిల్‌ తీసుకవచ్చి పోతున్నారు. ఈ పెద్ద మనిషి సీఎం కాక మునుపు మీరంతా కూడా రేషన్‌ షాపులకు వెళ్లి బియ్యంతో పాటు చెక్కర, కందిపప్పు, పామాయిల్, గోధుమలు, పిండి, కారెం, పసుపు, ఉప్పు, చింతపండు, కిరోసిన్‌ దొరికేవి ఇవన్నీ కూడా నీట్‌గా ప్యాక్‌ చేసి రూ.185లు మీ చేతుల్లో పెట్టేవారు. ఈరోజు నాలుగేళ్ల పాలన తర్వాత అడుగుతున్నా.. బియ్యం తప్ప మరేమైనా దొరుకుతున్నాయా అని అడుగుతున్నా. ఇంట్లో 6 మంది ఉంటే కనీసం ఇద్దరికైనా కటింగ్‌ పెడుతున్నారు.  చివరకు బియ్యం కూడా ఇవ్వకుండా దారుణంగా మోసం చేస్తున్నారు. నాలుగేళ్ల కింద ఈ పెద్దమనిషి అన్న మాటలు గుర్తుకు చేసుకోమని చెబుతున్నా. ప్రతి పేదవాడికి ఇళ్లు.. మూడు సెంట్ల స్థలం అన్నాడు. ఒక్క ఇళ్లు అయినా కట్టించాడా అని అడుగుతున్నా . ఇంత దారుణాతి దారునంగా మోసం చేస్తున్నారు. ఇవన్నీ ఈయన చేసిన మోసాలు. ఈయన కేవలం సీఎం హోదాలో ఉండి.. ఈయన గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఉంటే హోదా వచ్చి ఉండేది. హోదా వచ్చి ఉంటే ఉద్యోగాలు ఇక్కడే దొరికేవి. హైదరాబాద్‌. మద్రాసు, బెంగళూరు వెళ్లాల్సిన పనిఉండేది కాదు. పార్ట్‌నర్‌ సమ్మిట్‌ అంటారు. 20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయంటారు. 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతారు. ఇంత దారుణంగా మోసాలు చేస్తున్నారు. 

ప్రత్యేక హోదాపై చంద్రబాబును 6 ప్రశ్నలు అడుగుతున్నా. బాబుకు ప్రత్యేక హోదా విషయంలో చిత్తశుద్ధి ఉన్నా.. ఏమాత్రం సిగ్గు ఉన్నా సమాధానం చెప్పాలి. 
మొదటి ప్రశ్న: మార్చి 2, 2014లో మన రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి ఆమోదింపచేసి ప్లానింగ్‌కమిషన్‌కు  ఆదేశాలు జారీ చేసింది. బాబు సీఎం అయ్యాక ఆ ఫైల్‌ ప్లానింగ్‌ కమీషన్లో 7 నెలల పాటు అక్కడే పడి ఉన్నప్పుడు ఈ 7 నెలల కాలం ప్రత్యేక హోదా అడగకుండా గాడిదలు కాస్తున్నావా బాబూ ?
రెండవ ప్రశ్న: సెప్టెంబర్‌ 8,  2016లో ఆ రోజు అర్ధరాత్రి అరుణ్‌జైట్లీ గారు స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ప్రత్యేక హోదాకు బదులు  అబద్ధపు ప్యాకేజీ ప్రకటించారు. నిన్న చంద్రబాబు కేంద్రంలోని మంత్రులను ఉపసంహరించుకున్నారు. అరుణ్‌జైట్లీ అప్పటి ప్రకటించిన స్టేట్‌మెంట్‌కు ఇప్పుడు ప్రకటించిన స్టేట్‌మెంట్‌కు  ఏమైనా తేడా ఉందా? అలాంటప్పుడు హోదాకు బదులు ప్యాకేజీ ప్రకటిస్తే ఇదే బాబు ఆ రోజు అర్ధరాత్రి చేసిన పని ఏమిటంటే.. ప్రెస్‌మీట్‌ పెట్టి పొగిడారు. అసెంబ్లీలో ధన్యావాదాల తీర్మాణం చేశారు. ఢిల్లీకిS పోయి అరుణ్‌ జైట్లీగారికి శాలువలు కప్పారు. హోదాతో ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని అంటాడు. ప్రత్యేక  హోదాకు తూట్లు పొడుస్తూ మాట్లాడారు. 
మూడవ ప్రశ్న: హోదాపై ఏ పోరాటం చేసినా నువ్వు నీరు కార్చలేదా బాబూ? ప్రత్యేక హోదా కోసం 8 రోజులు నిరాహార దీక్ష చేస్తే మోడీకి నన్ను చూపించి హోదా కావాలని అడగకుండా నన్ను అరెస్ట్‌ చేయిస్తారా?  హోదా కోసం బంద్‌ పిలుపునిస్తే ఆర్టీసీ బస్సులు దగ్గరుండి తిప్పించలేదా? యువభేరీలకు విద్యార్థులు వస్తే వారిపై పీడీ యాక్ట్‌లు పెట్టలేదా? ఇది హోదాకు మోసం చేయడం కాదా?
నాల్గవ ప్రశ్న: అసలు మొన్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అవిశ్వాసం తీర్మానం పెట్టకపోయి ఉంటే నువ్వు పెట్టి ఉండేవాడివా బాబూ అని అడుగుతున్నా మార్చి 15 గురువారం సాయంత్రం సంఖ్యాబలం ఉంటేనే అవిశాసానికి మద్దతు ఇస్తామన్నారు. మార్చి 16 యూ టర్న్‌ తీసుకున్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ప్రతి పార్టీని కలిసి అవిశాస తీర్మానానికి మద్దతు తెలపాలని ఒప్పించారు కాబట్టి .. జాతీయ మీడియాలో వచ్చిందికాబట్టి ఈ పెద్దమనిషి మార్చి 16న ప్లేటు మార్చారు. తానే అవిశ్వాసం పెట్టబోతున్నానని చెప్పారు. ఇది మోసం కాదా బాబూ?
ఐదవ ప్రశ్న: అఖిల పక్షాన్ని  మొన్న పిలిచారు. దొంగతనాల నివారణకు గజదొంగ పిలిచినట్లు. అఖిలపక్షం కార్యాచరణ ఏమిటో తెలుసా? ఎవరు నిరసన తెలపకూడదట.ఎవరూ ఆందోళనలు చేయూడదట,  విద్యార్థులు ఉద్యమం చేయకూడదట, రాష్ట్రానికి చెడ్డపేరు వస్తుందంట. నల్లబ్యాడ్జీలు కట్టుకుని ఆఫీస్‌కు వెళ్లితే ప్రత్యేక హోదా వస్తుందా అని అడుగుతున్నా. ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతున్నా.
ఆరవ ప్రశ్న: అయ్యా చంద్రబాబు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. ఈ పార్లమెంట్‌చివరి రోజు నాటికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మా పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారు. మీ పార్టీకి చెందిన ఎంపీలతో కూడా రాజీనామా చేయించు.  మొత్తం  25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగిరాదా అని అడుగుతున్నా. రాజీనామాలు చేయించరట. రాజీనామా చేయిస్తే ఆయనపై  అవినీతి కేసులు పెడతారని భయం, ఆయన తరఫున పార్లమెంట్‌లో ఎంపీలు మాట్లాడకపోతే ఇబ్బంది అవుతుందని భయం.. సిగ్గులేకుండా హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెడుతున్నారు. ఇలాంటి మోసాలను చూడలేక  మన పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారు. ఆ తర్వాత నేరుగా ఆంధ్రాభవన్‌కు వెళ్లి అక్కడ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటారు. మనం ఎంపీలకు బాసటగా నిలుద్దాం. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలేదీక్షలు చేపడదాం. హోదా పోరుకు విద్యార్థులు కూడా కలిసి రావాలి. అప్పటికైనా బాబుకు జ్ఞానోదయం అయి ఎంపీలతో రాజీనామా చేయిస్తే అందరం కలిసి రాజీనామాలు చేసి నిరాహార దీక్షకు కూర్చుకుంటే కేంద్రం కచ్చితంగా దిగివస్తుంది. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. హోదా వస్తే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్‌ అవుతుంది. నాకు, మన పార్టీ ఎంపీలకు మీ ఆశీస్సులు కావాలి. 
Back to Top