వైయస్‌ జగన్‌ను సీఎం చేసుకుందాం


గుంటూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన త్వరలోనే చూడబోతున్నామని, వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీ ఎంపీ బాలశౌరీ చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పెదకూరపాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..  గత నాలుగేళ్లగా టీడీపీ పాలనను చూశారని, గ తంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఈ నియోజకవర్గంలో 10 ఎత్తిపోతల పథకాలు చేపట్టిన వేలాది ఎకరాలను సాగులోకి తెచ్చారన్నారు. తప్పుడు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క ఎకరాకైనా నీరు ఇచ్చారా ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. వేల కోట్లు పట్టిసీమ పేరుతో టీడీపీ నేతలు పంచుకున్నారని విమర్శించారు. పులిచింతల ప్రాజెక్టును కట్టిన మహానుభావుడు ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేశారన్నారు. బ్యాంకుల్లోనే ఇంకా బంగారం ఉందన్నారు. బంగారం ఉండాల్సింది నా అక్కా చెల్లెమ్మల మెడలో ఉండాలని వైయస్‌ జగన్‌ అంటున్నారన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top