వైయస్‌ జగన్‌తోనే సుపరిపాలన


గుంటూరు: వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే సుపరిపాలన సాధ్యమని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సంకల్ప యాత్ర 119వ రోజు నరసరావుపేట నియోజకవర్గంలో కొనసాగింది. పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడ కరువు ఉంటుందని శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. గత నాలుగేళ్లుగా నాగార్జున కుడి కాల్వ నుంచి సాగునీరు ఇవ్వలేదన్నారు. నీళ్లు ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం టీడీపీ నేతలకు లేదన్నారు. రైతులందరూ కూడా పంటలు పండించుకుంటే ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదన్నారు. రైతులకు మార్కెట్‌యార్డులో ధాన్యం అమ్ముకోలేని దుస్థితి నెలకొందన్నారు. టీడీపీ కార్యకర్తల కందులు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. కోడెల శివప్రసాద్‌ ఇక్కడ ఓడిపోతానని భయపడి సత్తనపల్లెకు పారిపోయారన్నారు. ఇక్కడ ఆయన కొడుకు, కూతురు దోచుకుతింటున్నారన్నారు. 23 క్రిమినల్‌ కేసులు ఉన్న వ్యక్తిని స్పీకర్‌గా నియమించడం బాధాకరమన్నారు. స్పీకర్‌ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన కొడుకు, కూతురు అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. బార్‌ షాపులు, అపార్ట్‌మెంట్ల నుంచి ట్యాక్స్‌లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడ చూసినా కూడా కోడెల కుటుంబం అవినీతికి పాల్పడుతుందన్నారు. సీఎం రిలీఫ్‌ ఫండ్, తిరుపతి లెటర్, ఆటోలు,  రిక్షాల కార్మికుల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారని విమర్శించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top