మంత్రి పుల్లారావు అరాచకాలకు అంతే లేదు


గుంటూరు: ప్రత్తిపాటి పుల్లారావు రాష్ట్రానికి మంత్రి అయితే ఆయన భార్య నియోజకవర్గానికి మంత్రి అయ్యారని విమర్శించారు. పుల్లారావు మంత్రి కాగానే చేసిన పని ఏంటో తెలుసా..సీటి కెబుల్‌ నడుపుతున్న టీడీపీ నేతలు మన పార్టీకి చెందిన 10 వేల కలెక్షన్లు సొంతం చేసుకున్నారని విమర్శించారు. 2014–2015లో వర్షాలు ఎక్కువగా పడటంతో పత్తి మొత్తం తడిసిపోయిందన్నారు. సీసీఐ అధికారులు మార్కెట్‌యార్డులో పత్తిని కొనుగోలు చేయలేదన్నారు. పుల్లారావు మిల్లును సీసీఐకి అద్దెకు ఇచ్చారని, క్వింటాల్‌ రూ.3 వేల చొప్పున కొనుగోలు చేశారన్నారు. కొనుగోలులో రూ.600 కోట్ల అక్రమాలు జరిగాయని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విచారణలో చిలకలూరిపేట మార్కెట్‌యార్డు సెక్రటరీని సస్పెండ్‌ చేశారన్నారు.  రైతులకు రావాల్సిన నిధులను పుల్లారావు కాజేశారన్నారు. రాష్ట్రంలోని అగ్రిగోల్డు డిపాజిటర్లను మోసం చేశారని, అయితే వారి ఆస్తులను పుల్లారావు తన భార్య పేరుతో అగ్రిగోల్డు భూములు కొనుగోలు చేశారని విమర్శించారు. అగ్రిగోల్డు భూములను పుల్లారావు అప్పన్నంగా కాజేశారని మండిపడ్డారు. అగ్రికల్చర్‌ ల్యాండ్‌ను నాన్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌గా మార్చాలంటే పుల్లారావుకు డబ్బులు చెల్లించాల్సిందే అన్నారు. మద్యం ట్రెడింగ్‌ లైసెన్స్‌లు రెన్యువల్‌ చేయాలన్నా..దీపావళి మందులు అమ్ముకోవాలన్నా..వారికి డబ్బులు ఇవ్వాల్సిందే అన్నారు. ఆర్యవైశ్య కులానికి చెందిన శంకర్‌ అనే విలేకరిని కొట్టి, హింసించి చంపారని ఆరోపించారు. పుల్లారావుకు  వ్యకిరేకంగా శంకర్‌ వార్తలు రాస్తున్నారని ఆయన అనుచరులతో చంపించారన్నారు. కేసులో అసలు ముద్దాయిలను తప్పించారని పేర్కొన్నారు. సాక్షి పేపర్‌ విలేకరి సురేంద్ర అగ్రిగోల్డు వ్యవహారాలపై వార్తలు రాయడంతో ఓర్చుకోలేక పుల్లారావు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు పెట్టించారన్నారు. అతనిపై దాడి చేయించారన్నారు. విలేకరి ఉద్యోగం మానుకున్న మంత్రి వదలిపెట్టలేదన్నారు. ఆయన 8 ఎకరాల భూమిని పుల్లారావు, ఆయన భార్య బలవంతంగా ప్రోక్లైయిన్లతో దున్నించారన్నారు. ఈ బాధలు భరించలేక సురేంద్ర ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఈ నియోజకవర్గంలో ఇంకా పుల్లారావు అరాచకాలు చాలా ఉన్నాయన్నారు. వ్యాపారస్తులు భయపడుతున్నారన్నారు. అందుకే మా నాయకుడు వైయస్‌ జగన్‌ సమక్షంలో నేను భరోసా ఇస్తున్నానని చెప్పారు. ఎవరైనా స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవచ్చు అని ధైర్యం చెప్పారు.
– నియోజకవర్గంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని మ్రరి రాజశేఖర్‌ తెలిపారు. తాగడానికి నీరు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పంటలు సాగు చేసుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక నీటి సమస్యను తీర్చుతామన్నారు. పులిచింతల, ప్రకాశం బ్యారేజీ నుంచి నీరు తీసుకువస్తామన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం కాగానే మన సమస్యలకు పరిష్కారం దొరకుతుందని రాజశేఖర్‌ తెలిపారు. 
Back to Top