బాబు పాల‌న‌లో తీవ్ర ఇబ్బందులు

ఒంగోలు: కనిగిరి ప్రజలు పడుతున్న కష్టాలు మీకు చెబుతున్నామన్నా..నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మ‌ధుసూద‌న్ యాద‌వ్ అన్నారు. నియోజకవర్గంలో తాగునీరు, సాగునీరు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లోరైడ్‌ నీరు తాగి అకాల మరణాలు పొందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. కనిగిరి పట్టణంలో ఇంటి పన్ను రూ.5 వేలు, 10 వేల చొప్పున విధిస్తున్నారని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యే నెలకు రెండుసార్లు ఇక్కడికి వచ్చి కమీషన్లు తీసుకెళ్తున్నారు తప్ప చేసింది ఏమీ లేదన్నారు. ఎస్సీ సర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు చేసి అవమానపరిచారని చెప్పారు. కనిగిరి ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, మీరు ముఖ్యమంత్రి అయిన తరువాత వెలుగొండ ప్రాజెక్టు ఏడాదిలో పూర్తి చేస్తే ఈ ప్రాంత ప్రజలు మిమ్మల్ని మరిచిపోరని చెప్పారు. మా సమస్యలు తీర్చుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. 
Back to Top