స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోకి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌


నెల్లూరు:   వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు నెల్లూరు జిల్లాలో అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రతీ గ్రామంలో ప్రజలు ఆయనకు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. బుధ‌వారం ఉదయం స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని డేగ‌పూడి గ్రామంలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా  వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.  గడిచిన నాలుగేళ్లుగా టీడీపీ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకుంటూ మొక్కవోని దీక్షతో జనహృదయ నేత కదులుతుంటే పార్టీలకతీతంగా లక్షలాదిమంది ఆయనను అనుసరిస్తున్నారు. 3 వేల కిలోమీటర్ల ఈ సుదీర్ఘ పాదయాత్రలో జననేతకు బాసటగా పార్టీ పిలుపు మేరకు ‘వాక్‌ విత్‌ జగన్‌’ అంటూ జగన్‌ సైన్యం పాదయాత్రలతో ఉరకలెత్తింది. పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పలువురు తమ కష్టాలు, సమస్యలను వైయ‌స్‌ జగన్‌కు విన్నవించి భరోసా పొందుతున్నారు. తమ గ్రామంలో కనీస సౌకర్యాలు లేవని, పాలకులు తమను పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  వైయ‌స్‌ జగన్‌కు గ్రామస్తులు ఎదురేగి స్వాగ‌తం ప‌లుకుతున్నారు.  జననేత జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి అడుగులు కలిపారు. పలువురు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పేదల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇస్తూ  వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగారు.  డేగ‌పూడి వ‌ద్ద గ్రామ‌స్తుల‌తో వైయ‌స్ జ‌గ‌న్ మ‌మేక‌మై వారి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. అందరినీ పలకరిస్తూ.. ఆత్మీయ కరచాలనం చేస్తూ యాత్ర ముందుకు సాగుతోంది.
Back to Top