ఉత్తమ విలన్‌ బాబే!– టీడీపీ పాలనలో రైతులు అష్టకష్టాలు
– 7 గంటలు కూడా రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడం లేదు
– కృష్ణా డెల్టాలోనూ కొన్ని మండలాలకు నీళ్లు అందడం లేదు
– ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు
– చంద్రబాబే పెద్ద దళారీ అని రైతులు అంటున్నారు
–చంద్రబాబు పాలనలో ఎవరైనా సంతోషంగా ఉన్నారా?
– రుణమాఫీ వడ్డీలకే సరిపోలేదు
– చంద్రబాబు హైటెక్‌ పాలనలో ఫోన్‌ కొడితే ఇంటికే మద్యం
– నాలుగేళ్లలో మూడుసార్లు కరెంటు, ఆర్టీసీ చార్జీలు పెంచారు
– హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీ చెల్లదట
– అబద్ధాలు చెప్పేవారు..మోసాలు చేసేవారు మీకు నాయకుడు కావాలా? 
– వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకంతో పేదవారికి మంచి వైద్యం అందిస్తా
– ఏ  ఆపరేషన్‌ అయినా ఉచితంగా చేయిస్తాం
– విశ్రాంతి తీసుకునే సమయంలో డబ్బులు ఇచ్చి తోడుగా ఉంటాం
– దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేల పింఛన్‌
– చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ రావాలి

 గుంటూరు: అబద్ధాలు, నాటకాలు ఆడుతున్న చంద్రబాబుకు ఆస్కార్‌లో ఉత్తమ విలన్‌ అవార్డు ఇవ్వవచ్చు అని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా విషయంలో ఊసరవెళ్లి కంటే స్పీడ్‌గా రంగులు మార్చి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. హోదా సాధనకు తమతో కలిసి పోరాటం చేయకుండా తన మంత్రులతో రాజీనామాలు చేయించి చేతులు దులుపుకున్నారని, సిగ్గులేకుండా ఎన్‌డీఏ కూటమిలో చంద్రబాబు కొనసాగుతున్నారని విమర్శించారు. రేపు పొద్దున వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగుపరిచి పేదలకు మంచి వైద్యం అందజేస్తానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..

ఈ రోజు ప్రకాశం జిల్లా నుంచి వీడ్కోలు తీసుకుంటూ గుంటూరు జిల్లాలోకి అడుగుపెట్టాను. నాతో పాటు వేలాది మంది అడుగులో అడుగు వేశారు. ఒకవైపు పడుతున్న బాధలు చెబుతున్నారు. మరోవైపు నావెంట నడుస్తూ అన్నా..నీ వెంటే మేమున్నామని ప్రేమానురాగాలు పంచుతున్నారు. ఆత్మీయతలు చూపుతున్నారు. మీ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు చెబుతున్నాను.
– ఈ రోజు ఈ జిల్లాలో అడుగుపెడుతూనే దారి పొడువునా చెబుతున్న సమస్యలు బాధనిపించింది. ఇదే నియోజకవర్గంలో పూలు, మిరప, శనగ పంటలు పండిస్తున్నారు. అన్నా..నాన్నగారి హయాంలో ఉచిత కరెంటు ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. ఇవాళ చంద్రబాబు పాలనలో మా ఖర్మ ఏంటో తెలుసా అన్నా..నెల నెల కరెంటు బిల్లు రూ.3 వేలు వస్తుందని రైతన్నలు వాపోతున్నారు. రైతన్నలకు కరెంటు అన్న మాట ఎండమావి అయిపోయింది. ఏడు గంటలు కూడా విద్యుత్‌ ఇవ్వడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. ఆక్వా రైతులు నా వద్దకు వచ్చారు. చంద్రబాబు సీఎం కాగానే ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని రైతులు వాపోయారు. చంద్రబాబే దళారిగా మారారు కాబట్టి ఏ రైతుకు గిట్టుబాటు ధర లేదని చెబుతున్నారు. మా ఆక్వా రైతులను కూడా చంద్రబాబు వదిలిపెట్టడం లేదని చెబుతున్నారు. పంట పండే వరకు రేటు ఉంటుందని, చేతికొచ్చే సరికి ధర డబేల్‌ మని పడిపోతుందని రైతులు చెబుతున్నారు. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి ఉందని అక్వా రైతులు చెబుతున్నారు.
–  మత్స్యకారులు కూడా నా వద్దకు వచ్చారు. నియోజకవర్గంలో 400 పోర్టులు ఉండేవని చెబుతున్నారు. ఈ రోడు డీజిల్‌ రేట్లు విఫరీతంగా పెరిగాయి, బోటు రేట్లు మాత్రం పెరగలేదని వాపోతున్నారు. బోటుకు రిజిస్ట్రేషన్‌ కూడా చేయడం లేదని మత్స్యకారులు చెబుతున్నారు.
–కృష్ణా డెల్టా ప్రాంతంలో నీరు సరిగా అందడం లేదు. నాన్నగారు బతికి ఉన్నప్పుడు కృష్ణా డెల్టాను ఆధునీకీకరణకు రూ.4 వేల కోట్లు కేటాయించారు. చంద్రబాబు నాలుగేల్లుగా ఒక్కసారి కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంత దారుణంగా ఒక్క బాపట్ల నియోజకవర్గంలోనే  ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు. శనగ పంటకు రూ. 3500, కంది రూ.5440 మద్దతు ధర ఉంది. మినుములు రూ.5400 మద్దతు దర ఉంది. మిర్చి రూ.6 వేలకు కూడా రైతుల నుంచి కొనే నాథుడు లేడు. ఎవరి ముఖంలో చూసినా కూడా కన్నీరే కనిపిస్తోంది.
– నాలుగేళ్ల చంద్రబాబు పాలన మనం చూశాం. ఏపీ అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. వ్యవసాయం బ్రహ్మండంగా ఉందని గొప్పలు చెబుతున్నారు. స్థానికంగా ఉద్యోగాలు లేక యువకులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. విశాఖలో పెట్టుబడుల సదస్సులు పెట్టి అద్దె కోట్లు వేయించి రూ. 20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, లక్షల కొద్ది ఉద్యోగాలు వచ్చాయని గొప్పగా చెబుతున్నారు. ఎక్కడైనా ఉద్యోగాలు కనిపిస్తున్నాయా?అభివృద్ధి గురించి నాలుగేళ్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. నిన్నటి కన్న ఇవాళ బాగుంటే దాన్ని అభివృద్ధి అంటారు. 
– ఈ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో మీలో ఏ  ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? రైతులు సంతోషంగా లేరు. తాను చేస్తానన్న రుణమాఫీ పథకం కనీసం వడ్డీలకు సరిపోవడం లేదు. పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలు సంతోషంగా లేరు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను..కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా? బ్యాంకుల నుంచి మాత్రం వేలం నోటీసులు ఇంటికి వస్తున్నాయి.
– ఇదే పెద్ద మనిషి చదువుకుంటున్న పిల్లలను వదిలిపెట్టడం లేదు. పిల్లలను మోసం చేయడం దారుణం అన్న ఆలోచన చేయలేదు. ఆ రోజు చంద్రబాబు మాట్లాడిన మాటలు ఏంటి? జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ప్రతి ఇంటికి చంద్రబాబు తన మనిషిని పంపించి చంద్రబాబు సంతకం చేసిన ఓ లెటర్‌ ఇచ్చారు. ప్రతి ఇంటికి ఉద్యోగం, లేదంటే నిరుద్యోగ భృతి రూ.2 వేలు ఇస్తామన్నారని ప్రచారం చేశారు. ఇవాళ్టికి చంద్రబాబు అధికారంలోకి వచ్చి 48 నెలలు అయ్యింది. ఇప్పటికి రూ.96 వేలు బాకీ పడ్డారని గట్టిగా అడగండి. అప్పుడైనా ఆయనకు అర్థం అవుతుంది. 
– ఒక్కసారి చంద్రబాబు పాలన చూడండి. ఎన్నికలసమయంలో చంద్రబాబు ఏమన్నారు. పిల్లలు తాగి చెడిపోతున్నారని అన్నారు. మద్యాన్ని తగ్గిస్తానని చెప్పారు. నాలుగేళ్ల తరువాత మీ అందరిని అడుగుతున్నాను. మీ గ్రామాల్లో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఉందో లేదో తెలియదు కానీ, బెల్టు షాపు లేని గ్రామం లేదు. చంద్రబాబు హైటెక్‌ పాలన ఏ స్థాయిలో ఉందంటే..ఆయన కంప్యూటర్‌ నేనే కనిపెట్టానని చెప్పుకుంటుంటారు. చంద్రబాబు పాలనలో ఫోన్‌ కొడితే నీరు రావడం లేదు. కానీ మందు మాత్రం ఇంటికి వచ్చి ఇచ్చి పోతున్నారు.
– ఆ రోజు కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయని. అధికారంలోకి వచ్చాక కరెంటు బిల్లులు తగ్గిస్తామని చెప్పారు. గతంలో కరెంటు బిల్లులు రూ.50, 70, వంద లోపు, ఇప్పుడు రూ.500,  వెయ్యి రూపాయల చొప్పున కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నారు. గతంలో రెండు నెలలకు ఒకసారి బిల్లు వచ్చేది. ఇప్పుడు నెల నెల బిల్లు వస్తోంది. 
– నాలుగేళ్ల క్రితం రేషన్‌షాపుల్లో బియ్యంతో పాటు కందిపప్పు, చక్కెర, పామాయిల్, గోదుమలు ఇలా 9 రకాల సరుకులు చక్కగా ప్యాక్‌ చేసి ఇచ్చేవారు. ఇ ప్పుడు బియ్యం తప్ప మరేమి  ఇవ్వడం లేదు. ఇందులో కూడా వేలి ముద్రలు పడటం లేదని కోత విధిస్తున్నారు.
– చంద్రబాబు గట్టిగా అడిగి ఉంటే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా హక్కుగా వచ్చేది. నాలుగేళ్ల చంద్రబాబు డ్రామాలు చూశాం. ఎన్నికలకు ముందు ఏం మాట్లాడారు. ఆ తరువాత ఏం మాట్లాడారు. ఊసరవెళ్లి కంటే స్పీడ్‌ గా రంగులు మార్చుతున్నారు. మొన్ననే అస్కార్‌ అవార్డులు ఇచ్చారు. పేపర్లో చూశా..చంద్రబాబు ఫోటో కనిపించలేదు. వారు విదేశాల్లో ఉంటారు కాబట్టి చంద్రబాబు నటన చూసి ఉండరు. ఒ క వేళ వారు చూసి ఉంటే ఉత్తమ విలన్‌ అవార్డు ఎవరికి వచ్చేది..అందరి నోట  ఒకే మాట. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత, విలువలు, నిజాయితీ అన్న గుణాలు ఉండాలి. ఈ మూడు లేకపోతే మనుషులు ఎలా తయారు అవుతారో తెలుసా అచ్చు చంద్రబాబులా తయారవుతారు. ఇదే పెద్ద మనిషిని అడుగుతున్నాను. ఇది వాస్తవం అవునా? కదా అని అడుగుతున్నాను. మార్చి 2014లో రాష్ట్రాన్ని విడగొట్టిన సమయంలో పార్లమెంట్‌ నుంచి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రాణాళిక సంఘానికి నివేదికలు ఇచ్చింది అవునా?కదా? ఎన్‌డీఏ పాలనలో 7 నెలల పాటు ఆ ఫైల్‌ ఫ్లానింగ్‌ కమిషన్‌లో ఉన్నది వాస్తవం కాదా? ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత 11 నెలల పాటు 13వ ఆర్థిక సంఘం సిపార్సులు చేసింది వాస్తవం కాదా?అసలు 14వ ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదాకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నాను. అటువంటిది 2014 మార్చిలో 13వ ఆర్థిక సంఘం ఉన్నప్పుడే ప్రణాళిక సంఘం నివేదికలు పంపించింది. అలాంటప్పుడు 14వ ఆర్థిక సంఘంతో పనేంటి అని అడుగుతున్నాను.
– మొన్న అరుణ్‌జైట్లీ స్టేట్‌మెంట్‌ ఇవ్వగానే చంద్రబాబు ఉలిక్కిపడి తన మంత్రులతో రాజీనామా చేయించారు. 2016 లో అరుణ్‌జైట్లీ అర్థరాత్రి మాట్లాడిన మాటలను చంద్రబాబు స్వాగతించింది వాస్తవం కాదా? .  ఇదే అరుణ్‌జైట్లీని శాలువాలతో సన్మానించింది వాస్తవం కాదా. ఇదే పెద్ద మనిషి ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పారు. దేశంలో 7 శాతం గ్రోత్‌ రేటు చూపిస్తుంటే..మన రాష్ట్రం వరుసగా ఇబ్బందులు పడి రైతులు కరువుతో అల్లాడుతుంటే ఏపీ గ్రోత్‌ రేటు 12 శాతం చూపించడం ధర్మమేనా? ఉద్యోగాల విషయంలో ఒక్క ఉద్యోగం రాక పిల్లలు ఇబ్బందులు పడుతుంటే విశాఖలో మీటింగ్‌ పెట్టి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగాలు అంటున్నారు. ఈయన పెంచిన ఫిగర్స్‌తో తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని తప్పుడు లెక్కలు చూపించి, ఈ లెక్కలు నిన్నటి బడ్జెట్‌లో తారాస్థాయికి చేరాయి. రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల మిగులు బడ్జెట్‌ ఉందని తప్పుడు లెక్కలు చెబుతున్నారు. ఇంత ఆదాయం ఉంటే ఎవరైనా ప్రత్యేక హోదా ఇస్తారా? 
– ప్రత్యేక హోదా గురించి నీరుగార్చే విషయంలో ఈ మధ్య కాలంలో రక్తికట్టించారు. కేంద్రంలో ఉన్న తన మంత్రులను ఉపసంహరించుకున్నారు. కొద్దొగోప్పో జ్ఞానోదయం అయ్యిందనుకుంటే ..ఆయన చేసిన వెదవ పని ఏంటో తెలుసా ఆయన ఎన్‌డీఏ కన్వీనర్‌గా కొనసాగుతారట. ప్రజలు ఏమైనా చెవిలో పువ్వులు పెట్టుకున్నారా? మార్చి 21న అందరు ఎంపీలు ఒకతాటిపైకి వచ్చి కేంద్రంపై ప్రత్యేక హోదా విషయంలో అవిశ్వాసం తీర్మానం పెడదామని పిలుపునిస్తే..ఈ పెద్ద మనిషి ముందుకు రావడం లేదు. అవిశ్వాస తీర్మానం పెట్టి ఉంటే దేశం మొత్తం మనవైపు చూసేవారు. చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెట్టరట. మనం పెడితే ఆయన మద్దతు ఇవ్వరట. పార్లమెంట్‌లో పోరాటం చేసిన తరువాత కూడా కేంద్రం ముందకు రాకపోతే 25 మంది ఎంపీలతో రాజీనామాలు చేయిద్దాం రండి అని కోరితే చంద్రబాబు ముందుకు రావడం లేదు. అప్పుడు కేంద్రం దిగి వచ్చి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతుంది. ఈ పెద్ద మనిషి అవిశ్వాసానికి ఒప్పుకోరట. రాజీనామాలు చేయటర. 
– నాలుగేళ్ల చంద్రబాబు పాలన మీరందరూ చూశారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయి. మీకు ఎలాంటి నాయకుడు కావాలని ఆలోచన చేయండి. మోసం చేసేవాడు నాయకుడు కావాలా? అబద్ధాలు చెప్పేవారు నాయకుడు కావాలా? ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి. ఈ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలు రాకపోతే మార్పు అన్నది రాదు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థ బాగుపరచాలంటే ఒక్క జగన్‌ వల్ల అయ్యే పని కాదు. జగన్‌కు మీ అందరి తోడు, దీవేనలు కావాలి. అప్పుడే ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం వస్తుంది.
– చంద్రబాబుకు పొరపాటున క్షమిస్తే..ఇదే వ్యక్తి రేపు పొద్దున చిన్న చిన్న అబద్ధాలు చెప్పడు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటారు. నమ్ముతారా? . నమ్మరని చంద్రబాబుకు తెలుసు..కేజీ బంగారానికి బోనస్‌ అంటారు. ప్రతి ఇంటికి బెంజికారు అంటారు. నమ్మరు అని తెలుసు కాబట్టి ప్రతి ఇంటికి మనిషిని పంపించి ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతారు. డబ్బు ఇస్తే మాత్రం వద్దు అనకండి. రూ.5 వేలు అడగండి, ఆడబ్బంతా మనదే..మన జేబుల్లో నుంచి దోచిన సొమ్మే. కానీ ఓటు వేసే సమయంలో మాత్రం మనసాక్షి ప్రకారం వ్యవహరించండి. అబద్ధాలు ఆడేవారిని, మోసాలు చేసేవారిని బంగాళఖాతంలో కలపండి. అప్పుడే ఈ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం వస్తుంది. 
– మనందరి ప్రభుత్వం వచ్చాక ఏం చేస్తామన్నది నవరత్నాలు ప్రకటించాను. ప్రతి సభలోనూ కొన్ని నవరత్నాలు చెబుతున్నాను. అందులో ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే చెప్పండి. మీ సలహాలు స్వీకరిస్తాను. ఇవాళ పేదవాడి ఆరోగ్యం గురించి చెబుతున్నాను.
– ఇక్కడ ఉన్న వారంతా కూడా గుండెలపై చేయి వేసుకొని ఆలోచించండి. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తుకు తెచ్చుకోండి. ఏ పేదవాడైనా అప్పులు పాలు అయ్యే పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆ పేదవాడు తన పిల్లలను ఉన్నత చదువులు చదివించేందుకు, వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. నాన్నగారి పాలనలో 108 నంబర్‌కు ఫోన్‌కొడితే చాలు 20 నిమిషాల్లో మన ముందు అంబులెన్స్‌ వచ్చేది. ఇవాళ అంబులెన్స్‌ కు ఫోన్‌ కొడితే డీజిల్‌ లేదని, జీతాలు అందక ధర్నా చేస్తున్నామన్న సమాధానాలు వస్తున్నాయి. ఏదైనా వైద్యం చేయించుకోవాలంటే హైదరాబాద్‌కు వెళ్తాం. అక్కడ మంచి ఆసుపత్రులు ఉంటాయి కాబట్టి పెద్ద రోగం వస్తే అక్కడికే వెళ్తాం. ఇవాళ మనలో ఎవరికైనా ఆరోగ్యం బాగలేక హైదరాబాద్‌కు వెళ్తే ఆరోగ్యశ్రీ కట్‌ అంటున్నారు. ఇక్కడ మంచి ఆసుపత్రులు లేవు. ఉన్న ఆసుపత్రిల్లో పిల్లలను ఎలుకలు కొరుకుతున్నాయి. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు నెలల తరబడి బిల్లులు చెల్లించడం లేదు. ఆరోగ్యశ్రీ రోగులకు నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో వైద్యం అందడం లేదు. చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. ఇవాళ పొరపాటున క్యాన్సర్‌ వస్తే 8 సార్లు కీమో థెరపీ చేయాలి. ఒక్కసారి కీమో థెరపీ చేయాలంటే లక్ష ఖర్చు అవుతుంది. ఈప్రభుత్వం కేవలం రెండు సార్లు మాత్రమే కీమో థెరఫీ చేస్తారట. కీమో థెరఫీ చేయించుకోలేక రోగులు అకాల మరణాలు పొందుతున్నారు. కిడ్నీ పేషేంట్లకు డయాలసిస్‌కు నెలకు రూ.24 వేల ఖర్చు వస్తుంది. ఇవాళ కిడ్నీ బాగోలేకపోతే ఖాళీలు లేవని, డయాలసిస్‌ చేయడం లేదు. ఇవాళ చిన్నచిన్న పిల్లలకు మూగ, చెవుడు ఉంటే కాక్లియర్‌ ఇ న్‌ప్లాంటెషన్‌ఆపరేషన్‌ చేయించాలి. నాన్నగారి హయాంలో ఇలాంటి ఆపరేషన్లు ఉచితంగా చేయించేవారు. ఇవాళ ఆ మూగ, చెవుడు ఉన్న పిల్లల అవస్థలు వర్ణణాతీతం. నాన్నగారు పేద వారి కోసం ఒక అడుగు ముందుకు వేశారు. ఆయన కొడుకుగా జగన్‌ రెండు అడుగులు ముందుకు వేస్తాడు. మనందరి ప్రభుత్వం వచ్చాక ప్రతి పేదవాడికి వెయ్యి రూపాయలు బిల్లు దాటితే ఆ రోగాన్ని ఆరోగ్యశ్రీ కిందకు తీసుకువస్తాను. మంచి వైద్యం అందించేందుకు ఎక్కడైనా సరే ఆరోగ్యశ్రీ కింద చేయిస్తాం. ప్రతి పేదవాడికి ఉచితంగా ఆపరేషన్‌ చేయించడమే కాదు..డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తే..ఆ సమయంలో డబ్బులిచ్చి ఆదుకుంటాం. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న పేదవారికి చెబుతున్నాను..దీర్ఘకాలిక రోగులకు ప్రతి నెల రూ.10 వేలు పింఛన్‌ ఇచ్చి తోడుగా ఉంటానని చెబుతున్నాను. వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం తీసుకువచ్చి మీ అందరికి తోడుగా ఉంటానని మాట ఇస్తున్నాను. ఎవరైనా అర్జీ తీసుకొని వచ్చి నన్ను కలవచ్చు. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డకు తోడుగా ఉండమని, ఆశీర్వదించమని ప్రతి ఒక్కరిని పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 
Back to Top