ఆళ్ల‌గ‌డ్డ నుంచి పదో రోజు పాద‌యాత్ర ప్రారంభం

 కర్నూలు‌ :  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి పదో రోజు పాదయాత్రను ప్రారంభించారు. గురువారం ఉద‌యం ప్రారంభ‌మైన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చింతకుంట, దొర్నిపాడు మండలంలోని భాగ్యనగరం, రామచంద్రాపురం క్రాస్‌ రోడ్డు, కొండాపురం మీదుగా  కొనసాగుతుంది. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3గంటల వరకూ భోజనం విరామం తీసుకుంటారు. అనంతరం కొండాపురంలో పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. సాయంత్రం 4.30 గంటలకు దొర్నపాడు మండల కేంద్రం చేరుకొని పార్టీ జెండా ఎగురవేస్తారు. రాత్రి 7.30 గంటలకు పాదయాత్ర ముగించుకొని వైయ‌స్‌ జగన్‌ బస చేస్తారు.


Back to Top