కృష్ణా జిల్లాలోకి ప్ర‌వేశించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌




-   వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం
-  పోటెత్తిన క‌న‌క‌దుర్గ‌మ్మ వార‌ధి
విజ‌య‌వాడ‌:  ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు గ‌తేడాది న‌వంబ‌ర్ 6న ఇడుపుల పాయ నుంచి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ప్రతిపక్ష నాయకులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు వైయ‌స్ఆర్ జిల్లా, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల్లో పాద‌యాత్ర పూర్తి చేసుకొని ఇవాళ ఉద‌యం  దుర్గమ్మ సాక్షిగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించారు వైయ‌స్ జ‌గ‌న్‌. కనకదుర్గ వారధి వద్ద జ‌న‌నేత‌ కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలు రాజ‌న్న బిడ్డ‌కు ఘనస్వాగతం పలికారు. జననేతతో కలసి అడుగు వేసేందుకు జనం భారీగా తరలిరావడంతో కనకదుర్గ వారధి పోటెత్తింది. వైయ‌స్‌ జగన్‌ను కలిసేందుకు కృష్ణా జిల్లా లాయర్లు కనకదుర్గ వారధికి చేరుకున్నారు. జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 270 కిలోమీటర్ల మేర వైచయ‌స్‌ జగన్‌ పాదయాత్ర చేయనున్నారు. శనివారం పాదయాత్రలో భాగంగా కనకదుర్గ వారధి గుండా ఫ్లైఓవర్‌ బ్రిడ్జి, వెటర్నరీ ఆస్పత్రి సెంటర్‌, శిఖామణి సెంటర్‌, పుష్పా హోటల్‌ సెంటర్‌, సీతారాంపురం సెంటర్‌ మీదుగా కొత్తవంతెనకు చేరుకుంటారు. అక్కడినుంచి బీఆర్‌టీఎస్‌ రోడ్డు, మీసాల రాజారావు రోడ్డు, ఎర్రకట్ట మీదుగా చిట్టినగర్‌కు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. చిట్టినగర్‌ సెంటర్‌లో జరిగే బహిరంగం సభలో జననేత ప్రసంగిస్తారు. చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్‌ వద్ద యాత్ర ముగిస్తారు.  

తాజా వీడియోలు

Back to Top