వైయస్‌ జగన్‌ హామీతో ప్రభుత్వంలో ఉలికిపాటు

 

- ఆక్వా రైతుల‌తో సీఎం స‌మావేశం
- హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న ఆక్వా రైతులు
ప‌శ్చిమ గోదావ‌రి:  ఆక్వా రైతులకు న్యాయం చేస్తామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇవ్వడంతో  ప్రభుత్వంలో ఉలికిపాటు వచ్చింది. హుటాహుటిన ఆక్వా రైతులతో ముఖ్యమంత్రి  సమావేశం ఏర్పాటు చేశారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్రతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సర్కార్‌ దిగొచ్చింది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జననేత వైయ‌స్‌ జగన్‌ ఆక్వా రైతులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్న నేపథ్యంలో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. దీంతో శనివారం మధ్యాహ్నం ఆక్వా రైతులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. పాదయాత్ర చేస్తున్న వైయ‌స్‌ జగన్‌ శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పెదకాపవరంలో ఆక్వా రైతులను కలుసుకున్నారు.  అయితే గిట్టుబాటు ధరలు లేక ఓ వైపు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు ఏపీ సర్కార్‌ పెంచుతున్న విద్యుత్‌ ఛార్జీల భారం మోయలేక పోతున్నామంటూ వైయ‌స్‌ జగన్‌కు తమ సమస్యలను ఆక్వా రైతులు వివరించారు. వారి సమస్యలపై స్పందించిన వైయ‌స్‌ జగన్‌.. ఆక్వా రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జననేత వైయ‌స్‌ జగన్‌ తమకు మద్దతుగా నిలవడంతోనే ప్రభుత్వంలో కదలిక వచ్చిందంటూ ఆక్వా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Back to Top