జననేత ఆదరణ చూసి ప్రభుత్వంలో గుబులు

డోన్, బాడీ కెమెరాలతో పాదయాత్ర పరిశీలిస్తున్న సర్కార్‌
చిత్తూరు: ప్రజా సంకల్పయాత్రకు పెరుగుతున్న ఆధరణ చూసి ప్రభుత్వంలో అలజడి మొదలైంది. చంద్రబాబు సొంత జిల్లాలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజా సంకల్పయాత్రలో విశేష ఆదరణ పెరుగుతుండడంతో ప్రభుత్వం నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. డోన్‌ కెమెరాలను, బాడీ కెమెరాలను పెట్టి ప్రతీ అడుగును చిత్రీకరించేందుకు నిఘా ఏర్పాటు చేశారు. పాదయాత్ర గురించి చర్చించమని ఒకవైపు చెబుతూనే కెమెరాల ద్వారా ఫుటేజీని ఎప్పటికప్పుడు చూస్తున్నారని తెలుస్తుంది. ఇంటలీజెన్స్‌ వర్గాలకు పూర్తి సమాచారం అందిస్తున్నారు. పాదయాత్రకు మద్దతు పెరుగుతుండడంతో, ప్రజలకు నవరత్నాల పథకాల వివరాలను చంద్రబాబు తెలుసుకుంటున్నట్లు సమాచారం. పాదయాత్రకు సంబంధించి ఎవరెవరు వైయస్‌ జగన్‌ను కలుస్తున్నారు.. అనే విషయాలను తెలుసుకుంటున్నారు. పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు ప్రభుత్వంలో గుబులు మొదలైంది. 
Back to Top