57వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 
 చిత్తూరు : వైయ‌స్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర  57వ మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గం బత్తలవారిపల్లి గ్రామం నుంచి ప్రారంభ‌మైంది. అక్కడి నుంచి మిట్టపాల్యం, వెంకటాపురం గ్రామాల మీదుగా బండకింద పల్లి, రాఘవరెడ్డి పల్లి, మణిక్య రాయుని పల్లి చేరుకుంటుంది. ఆ త‌రువాత‌ కార్తికేయపురం, అట్టవారిపల్లి గ్రామాల మీదుగా పెనుమూరుకి పాదయాత్ర కొన‌సాగుతుంది. పెనుమూరులో ఏర్పాటు చేసిన‌ బహిరంగ సభలో వైయ‌స్‌ జగన్‌ ప్రసంగిస్తారు. అక్కడి నుంచి గొబ్బిల్లమిట్ట, గాంధీపురం మీదుగా చిప్పరపల్లి చేరుకుని పాదయాత్రను ముగిస్తారు. 

 
Back to Top