చలించిన వైయస్‌ జగన్‌

 
– పేద పిల్లలను చదివిస్తానని హామీ
– పింఛన్లు అందడం లేదని మహిళలు ఆవేదన 

అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ రైతుల కష్టాలను చూసి చలించిపోయారు. 28వ రోజు ప్రజా సంకల్ప యా త్రలో భాగంగా వీరన్నపల్లెలో పత్తి చేనులోకి వెళ్లి పూర్తిగా దెబ్బతిన్న పంటను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళా రైతు తమ కష్టాలను వైయస్‌ జగన్‌కు వివరించారు. ఎకరాకు రెండు క్వింటాళ్ల దిగుబడు కూడా రావడం లేదని, గిట్టుబాటు ధర లేదని రైతు వాపోయాడు. ఆర్థిక స్థోమత లేకపోవడంతో తమ పిల్లలను చదివించలేకపోతున్నామని ఓ మహిళ తమ పిల్లలను చూపిచడంతో వైయస్‌ జగన్‌ చలించిపోయారు. 

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు ఈ దుస్థితి
చంద్రబాబు ప్రభుత్వ నిరక్ష్యం వల్లే రైతులకు గిట్టుబాటు ధరలు అందడం లేదని, క్వాలిటీ లేదని రైతుల కష్టాన్ని వ్యాపారులు దోచుకుంటున్నారని వైయస్‌ జగన్‌ విమర్శించారు. ఎకరాకు రెండు క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదని, టీడీపీ ప్రభుత్వ హయంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని ధ్వజమెత్తారు. పత్తికి గిటుబాటు ధర లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఆర్థిక స్థోమత లేక పిల్లలను వ్యవసాయ పనులకు తీసుకెళ్తున్నారని తెలిపారు. పేద పిల్లలందరిని తాను చదివిస్తానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.

పింఛన్లు అందడం లేదు..
అన్ని అర్హతలు ఉన్నా పింఛన్లు రావడం లేదని తాడిపత్రి నియోజకరవ్గంలోని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. పెనమాక జంక్షన్‌లో మహిళలు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. నా భర్త చనిపోయి మూడేళ్లు అవుతున్నా ఇంతవరకు పింఛన్‌ఇవ్వడం లేదని ఓ మహిళా ఆవేదన వ్యక్తం చేశారు. పని చేసుకొని ఇద్దరు ఆడపిల్లలను చదవించుకుంటున్నానని పేర్కొంది. మరో మహిళ కూడా తన పింఛన్‌ రద్దు చేశారని ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీలో దరఖాస్తు చేసుకున్నా..పట్టించుకోవడం లేదని వైయస్‌ జగన్‌కు తెలిపారు. మా భర్తకు చెవుడు ఉందని, ఏ పని చేతకాదని, ఆయనకు పింఛన్‌ ఇవ్వమని కోరినా ఎవరు స్పందించడం లేదని ఓ మహిళ పేర్కొన్నారు.

జన్మభూమి కమిటీలదే పెత్తనం
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే జన్మభూమి కమిటీలదే పెత్తన మని స్థానికులు పేర్కొన్నారు. తాడిపత్రి నియోజకర వర్గంలో జన్మభూమి కమిటీ సభ్యులు రెకమెండ్‌ చేసిన వారికే  పింఛన్లు ఇస్తున్నారని రమేష్‌ అనే వ్యక్తి పేర్కొన్నారు. టీడీపీ నేతల చెప్పుచేతల్లోనే సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు సర్కార్‌ హయాంలో పేదలకు అన్యాయం జరుగుతంందనిఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన వైయస్‌ జగన్‌ వారికి హామీ ఇచ్చారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే 45 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని, నెలకు రూ.2 వేల పింఛన్‌ ఇస్తామని వైయస్‌ జగన్‌ మాటిచ్చారు.
 
Back to Top