కృష్ణ‌మ్మ జ‌న‌సంద్రం- కృష్ణ‌మ్మ ఒడిలో జ‌న‌నేత‌కు బ్ర‌హ్మ‌ర‌థం
- బెజవాడ గ‌డ్డ‌పై కొత్త చ‌రిత్ర సృష్టించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
విజ‌య‌వాడ‌:  ప్రజాసంకల్పయాత్ర ద్వారా కృష్ణా జిల్లాకు వస్తున్న వైయ‌స్‌ జగన్‌తో కలసి అడుగులో అడుగు వేసేందుకు జనం ఉప్పెన తరలివచ్చారు.వైయ‌స్  జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర శనివారం దుర్గమ్మ సాక్షిగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. కనకదుర్గ వారధి వద్ద వైయ‌స్‌ జగన్‌ కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తమ ముంగిటకు వచ్చిన జననేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ, మంగళహారతులు పట్టారు. ముఖ్యమంత్రి కావాలంటూ దీవెనలందించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా జననేతతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. అభిమాన నేతతో సెల్ఫీలు దిగి సంబరపడ్డారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ, వారి సమస్యలను ఓపికగా ఆలకిస్తూ.. తాను అండగా ఉంటానని ధైర్యం చెబుతూ వైయ‌స్‌ జగన్‌ ముందుకు సాగారు. వైయ‌స్‌ జగన్ రాగానే తమ అభిమాన నేతను చూసిన ఆనందంలో ప్రజలు నినాదాలతో హోరెత్తించారు. సీఎం.. సీఎం.. జై జగన్‌ అంటూ నినదించారు. జననేతతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. ఆయనతో సెల్ఫీలు తీసుకుని సంబరపడ్డారు. పదే పదే వాటిని చూసుకుని మురిసి పోయారు.  వేలాదిగా జ‌నం త‌ర‌లిరావ‌డంతో కృష్ణ‌మ్మ వార‌ధి జ‌న‌సంద్రంగా మారింది. బెడ‌వాడ చ‌రిత్ర‌లో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర కొత్త చ‌రిత్ర సృష్టించింది. ఊహించిన దానికంటే రెట్టింపు స్థాయిలో జ‌నం త‌ర‌లిరావ‌డంతో టీడీపీ శ్రేణుల్లో వ‌ణుకు పుట్టింది. 
Back to Top