13న ప.గో జిల్లాలోకి ప్రజా సంకల్ప యాత్ర

పశ్చిమ గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఈ నెల 13వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుందని పార్టీ నాయకులు ఆళ్లనాని, తలశీల రఘురాం, కోటగిరి శ్రీధర్‌ పేర్కొన్నారు. జిల్లాలో 13 నియోజకవర్గాల్లో 250 కిలోమీటర్లకు పైగా వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తారని తెలిపారు. ఈ నెల 14న ఏలూరు సమీపంలోని మాదేపల్లి వద్ద వైయస్‌ జగన్‌ పాదయాత్ర 2 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా 40 అడుగుల పైలాన్‌ను వైయస్‌జగన్‌ ఆవిష్కరిస్తారని చెప్పారు. అదే రోజు సాయంత్రం ఏలూరు పాతబస్టాండ్‌ కూడలిలో జరిగే బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ నేతలంతా అవినీతి ఆరోపణలలో కూరుకుపోయారని వారు విమర్శించారు. 

 
Back to Top