ప్రజా సంకల్పయాత్ర రాజకీయ సంచలనాలకు మారుపేరు


వైయస్‌ జగన్‌ నాయకత్వ పటిమ ప్రజలకు అర్థమైంది
చంద్రబాబు ఎన్ని పోరాటాలు చేసినా ఆలోచించాల్సిన పనిలేదు
నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టేలా మిగతా 5 జిల్లాల పాదయాత్ర
2 వేల కిలోమీటర్ల మైలురాయికి చారిత్రాత్మక ప్రాధాన్యం
పాదయాత్రలోని విషయాలన్నింటికీ కట్టుబడి ఉన్నాం
వైయస్‌ఆర్‌ పాలన అందించేందుకు వైయస్‌ జగన్‌ సిద్ధం
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం

విజయవాడ: ప్రజా సంకల్పయాత్ర అనేక రాజకీయ సంచలనాలకు మారుపేరుగా నిలిచిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, పాదయాత్ర కోఆర్డినేటర్‌ తలశీల రఘురాం అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం గల చంద్రబాబు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అనుసరిస్తున్నారని చెప్పారు. పాదయాత్ర ప్రారంభించిన తరువాత వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంపై అవిశ్వాసం ప్రవేశపెట్టడం, ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణదీక్షకు కూర్చోవడం జరిగిందన్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వ పటిమ చంద్రబాబును కేంద్రం నుంచి బయటకు వచ్చేలా చేసి హోదా వద్దన్న నోటితోనే హోదా హక్కు అని పలికిందన్నారు. వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించినప్పుటి నుంచి పాదయాత్రను విఫలం చేయడానికి టీడీపీ అనేక కుట్రలు చేసిందన్నారు. అయినా వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలు ఎక్కడా ఉద్రేకానికి గురికాకుండా ప్రశాంతంగా విజయవంతం చేశారని, వారందరికీ రఘురాం కృతజ్ఞతలు తెలిపారు.
 
పాదయాత్రలో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలు, చేతివృత్తుల వారు అనేక సమస్యలను జననేత దృష్టికి తీసుకువస్తున్నారని తలశీల రఘురాం చెప్పారు. ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం చేసే విధంగా అనేక సూచనలు ఇస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలు, ఎజెండా మొత్తం ప్రజలకు వైయస్‌ జగన్‌ వివరిస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌ను అనుసరిస్తూ టీడీపీ నేతలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వ పటిమను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు చేసిన పిల్లిమొగ్గలు.. నాలుగేళ్లుగా హోదా ఒక్కటే రాష్ట్ర అభివృద్ధికి మార్గమని వైయస్‌ జగన్‌ పోరాటం చేస్తున్నారన్నారు. ప్రజలంతా రాష్ట్రానికి వైయస్‌ జగన్‌ సమర్థుడని నిర్ణయానికి వచ్చారన్నారు. ఎవరూ ఏ పోరాటం చేసినా దాని గురించి ఆలోచించాల్సిన పనిలేదన్నారు. 

రాబోయే రోజుల్లో మిగతా 5 జిల్లాల్లో జరగబోయే పాదయాత్ర నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టే విధంగా ఉంటుందని రఘురాం స్పష్టం చేశారు. వైయస్‌ జగన్‌కు ప్రజల అండదండలు మెండుగా ఉన్నాయన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వైయస్‌ జగన్‌ 2వేల కిలోమీటర్ల మైలురాయిని దాటనున్నారని చెప్పారు. రెండు వేల కిలోమీటర్లకు చారిత్రాత్మక ప్రాధాన్యం ఉందన్నారు. గతంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి 2013 మే 14వ తేదీన పాదయాత్ర ద్వారా ఏలూరులో అడుగుపెట్టారని, అదే రోజు వైయస్‌ జగన్‌ కూడా ఏలూరులో అడుగుపెట్టనున్నారన్నారు. అంతేకాకుండా మరోప్రజా ప్రస్థానం పేరుతో వైయస్‌ షర్మిల చేపట్టిన పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు ఏలూరులోనే పూర్తి చేసుకున్నారన్నారు. ప్రజా సంకల్పయాత్ర 2 వేల కిలోమీటర్ల పూర్తి సందర్భంగా ఏలూరులో పైలాన్‌ ఆవిష్కరించి భారీ బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగిస్తారని చెప్పారు. .

ప్రజా సంకల్పయాత్రలో జరిగిన అన్ని విషయాలకు కట్టుబడి.. ప్రజలకు మేలు చేయడానికి మహానేత వైయస్‌ఆర్‌ పాలన అందించడానికి వైయస్‌ జగన్‌ చిత్తశుద్ధితో పనిచేస్తారన్నారు. 75 నియోజకవర్గాల్లో రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకొనే సరికి వైయస్‌ జగన్‌ 125 మండలాలు, 1550 గ్రామాలు.. 75 బహిరంగ సభలు, రెండు కార్పొరేషన్‌లు, 25 మున్సిపాలిటీల్లో పర్యటన సాగుతుందన్నారు. ప్రజాక్షేత్రం నుంచి అనేక సమస్యలపై ప్రస్తావించారన్నారు. తెలుగుదేశం పార్టీకి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల ఆదరణ ఏ విధంగా ఉందో.. నిన్న చంద్రబాబు తన మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి నిర్వహించిన ర్యాలీ.. వైయస్‌ జగన్‌ గుడివాడలో నిర్వహించిన సభ రెండు క్లిప్పింగ్‌లు చూస్తే అర్థం అవుతుందన్నారు. ప్రజలకు వైయస్‌ జగన్‌పై ఉన్న ప్రేమ కనిపిస్తుందన్నారు. ప్రజలు అసహ్యించుకుంటున్నా.. చేసేది లేక చంద్రబాబు కాలం వెల్లదీస్తున్నారన్నారు. 
Back to Top