'ప్రజల పక్షాన పోరాడేది వైయస్‌ఆర్‌సిపి ఒక్కటే'

కర్నూలు : ప్రజలు, రైతుల పక్షాన పోరాటాలు చేస్తున్నది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే అని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి పేర్కొన్నారు. అధికారంలో లేకపోయినా పార్టీని మొదటి స్థానంలో నిలిపిన ఘనత పార్టీ అధినేథ శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఆయన అన్నారు. కర్నూలు జిల్లా గడివేములలోని బివిఆర్ కళాశాలలో‌ శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

చిన్న వయస్సులో తండ్రి ఆశయ సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న జననేత శ్రీ జగన్‌కు ప్రజలు అండగా ఉన్నారన్నారు. సహకార ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్, ‌టిడిపిలకు దిమ్మతిరిగేలా తీర్పునిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పార్టీకి కార్యకర్తలే మూలస్తంభాలని.. అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సైనికుల్లా పోరాడుతున్నారన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని మరికొంత కాలం జైల్లోనే కొనసాగిస్తే రాబోయే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు భూస్థాపితం కావడం తథ్యమన్నారు. విద్యుత్ బిల్లుల బాదుడు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు విసుగు చెందిన వారు కాంగ్రెస్‌, టిడిపిలకు గుణపాఠం చెప్పేందుకు ఎన్నికల కోసం ఎదురుచూస్తు‌న్నారని చెప్పారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గం అభ్యర్థిగా గౌరు చరిత బరిలో ఉంటారని భూమా నాగిరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న చరితకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలని కోరారు.

త్వరలో శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి రాజన్న రాజ్యాన్ని తిరిగి తీసుకువస్తారని పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి అన్నారు. గ్రామాల్లో అభివృద్ధి వైయస్‌ఆర్‌సిపితోనే సాధ్యమన్నారు. మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ, మండలంలో అత్యధిక సహకార సంఘాలు కైవసం చేసుకునేందుకు అందరూ కలసికట్టుగా పనిచేయాలన్నారు.

అనంతరం పెసరవాయి వైయస్‌ఆర్‌సిపి యువజన విభాగం నాయకుడు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో వెంకటేశ్వరరెడ్డి, హరినాథ్, మహే‌ష్, వినో‌ద్, గౌ‌స్‌మియా, సురేంద్ర, మరో 70 మంది యువకులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.
Back to Top