ప్రజల మంచినీటి కష్టాలపై షర్మిల ఆవేదన

పెదకొదమగుండ్ల (గుంటూరు జిల్లా), 26 ఫిబ్రవరి 2013: మాచర్ల నియోజకవర్గంలోనే కాదు తాను పాదయాత్ర చేసిన ఏడు నియోజకవర్గాల్లోనూ సాగు, తాగునీటి సమస్యతో జనం అల్లాడిపోతున్నారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు మంచినీరు అందించేందుకు తీవ్రంగా కృషి చేశారని గుర్తుచేశారు. రైతన్నలు నష్టపోతే పరిహారం కూడా ఇచ్చిన మంచి హృదయం ఉన్నవారు మహానేత డాక్టర్‌ వైయస్‌ఆర్‌ అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకున్నట్లు మీకెవరికైనా అనిపిస్తోందా? అంటూ శ్రీమతి షర్మిల ప్రజలను ప్రశ్నించారు. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో నిర్వహిస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మంగళవారం ఆమె పెదకొదమగుండ్ల గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు తాగునీటి సమస్యతో పాటు తాము ఎదుర్కొంటున్న అనేక సమస్యలను శ్రీమతి షర్మిల ముందు ఏకరువుపెట్టారు.

పెదకొదమగుండ్ల వాసులు చెప్పిన సమస్యలను ఎంతో శ్రద్ధగా విన్న శ్రీమతి షర్మిల వారి సమస్యలకు రాజన్న రాజ్యం ఒక్కటే పరిష్కారం చూపుతుందన్నారు. జగనన్న నేతృత్వంలో రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. రాజన్న రాజ్యంలో ప్రతి రైతూ సంతోషంగా ఉన్నారన్నారు. అప్పుల నుంచి బయటపడ్డారన్నారు.  ఇప్పుడు వారంతా అతివృష్టి, అనావృష్టులతో పాటు ప్రజావ్యతిరేక కాంగ్రెస్‌ ప్రభుత్వం విధానాలు, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుతో తీవ్రంగా నష్టాలపాలయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుత తరుణంలో మహానేత వైయస్‌ బ్రతికి ఉంటే 9 గంటల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసి ఉండేవారన్నారు.

'నీళ్ళు లేవా?. తాగడానికా? ఇప్పుడెందుకు లేవు? అంటూ షర్మిల స్థానికులను ప్రశ్నించారు. బోర్లలో నీళ్ళు రావడంలేదా లేక కృష్ణ నీళ్ళు రావడంలేదా?' అని ఆమె అడిగారు. కృష్ణ నీళ్ళు రావడంలేదని శ్రీమతి షర్మిలకు గ్రామస్థులు చెప్పారు. వైయస్‌ ఉన్నప్పుడు వచ్చాయా? ఇప్పుడెందుకు రావడంలేదని అడిగారు. పైపులు చెడిపోయాయా? అన్నారు.‌‌ మహానేత ఉన్నప్పుడు వర్షాలు కురిశాయని, మంచినీళ్ళూ వచ్చాయని, ఇప్పుడు సాగర్‌లోనే నీళ్ళు లేవని ప్రజలు చెప్పారు. కిరణ్ కుమార్‌రెడ్డి వచ్చాక నీటి సమస్య ఎక్కువైందని వారు ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ ప్రభత్వం రైతులు, విద్యార్థులు, వృద్ధులు ప్రతి ఒక్కరినీ విడిచిపెట్టేసిందని శ్రీమతి షర్మిల అన్నారు. ప్రభుత్వం మారే వరకూ ఈ కష్టాలు తప్పవన్నారు. కొద్ది కాలం ఓపిక పట్టాలని, త్వరలోనే జగనన్న నేతృత్వంలో రాజన్న రాజ్యం వస్తుందని అందరి కష్టాలు తీరతాయని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు.
Back to Top