ప్రజల కోసం కాదు... కాంగ్రెస్ కోసం..

హైదరాబాద్, 05 ఫిబ్రవరి 2013:

ఇచ్చిన మాటకు కట్టుబడిన ఒకే ఒక్క కారణంతోనే వైయస్ఆర్ కాంగ్రెస్  పార్టీ అధ్యక్షుడు శ్రీ  వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నారని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలే ఈ విషయాన్ని పలుమార్లు చెప్పారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే రాజేష్ మంగళవారం శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని చంచల్గూడ జైల్లో కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు చేపట్టిన మీ కోసం యాత్ర ప్రజలకోసం చేపట్టిందా లేక కాంగ్రెస్‌ కోసం చేపట్టిందా అని ప్రశ్నించారు. దానిని కాంగ్రెస్ కోసం చేపట్టిన యాత్రగా మార్చుకోవాలని సలహా ఇచ్చారు. తాము ధైర్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నామనీ,  బాబు మాత్రం చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారనీ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యేవారని, తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అయ్యేవారనీ  కాంగ్రెస్ ఇన్చార్జి గులాం నబీ ఆజాద్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

Back to Top