ప్రజల కష్టాలు పట్టని కిరణ్, చంద్రబాబు

సిర్పూర్ కాగజ్ నగర్, 21 మే 2013:

కాంగ్రెస్ ప్రభుత్వంపైనా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపైనా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ నిప్పులు చెరిగారు. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్‌లో మంగళవారం సాయంత్ర ఏర్పాటైన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, తదితరులు ఆమె సమక్షంలో పార్టీలో చేరారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ పాలనకు కిరణ్, చంద్రబాబు పాలనకు నడుమ వ్యత్యాసాన్ని ఆమె కళ్ళకు కట్టేలా వివరించారు. తెలంగాణ ప్రాంతం సస్య శ్యామలం కావాలని మహానేత ఆకాంక్షించారని శ్రీమతి విజయమ్మ తెలిపారు. జలయజ్ఞం పథకాన్ని వివరిస్తూ.. మహానేత మరణానంతరం అందులో చేపట్టిన ప్రాజెక్టుల గతి ఏమైందీ ఆమె సోదాహరణంగా చెప్పారు. మాజీ ఎంపీ ఇంద్రకరణ్ రెడ్డి, బోడ జనార్దన్, తదితరులు ఈ సభలో ప్రసంగించారు. శ్రీమతి విజయమ్మ ప్రసంగం ఆమె మాటల్లోనే...

'వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కోనేరు కోనప్ప, తదితరులను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. అభినందిస్తున్నాను. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి. తెలంగాణ అంటే ఆయనకు ఎంతో  ప్రేమ. ఆయన అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడూ కూడా దీని గురించే ఆలోచించారు. అన్ని   వర్గాల వారినీ  పరిశీలించి ప్రతి ఒక్కరి అవసరాలనూ గమనించారు. దేశానికి వెన్నెముకైన రైతు బాగుండాలని  ఆయన ఆకాంక్షించారు. వారికిచ్చే సబ్సిడీని మూడు వందల శాతం పెంచారు. కరెంటు బకాయిలను, రుణాలను  మాఫీ చేశారు. వీలైనంత మేరకు విత్తనాల రాయితీ ఇచ్చారు. వ్యవసాయానికి ఎకరాకు ఎంత ఖర్చయిందో అంతా రైతుకు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ఉండేలా చర్యలు తీసుకున్నారు. రైతు గురించి ఇంత శ్రద్ధ తీసుకున్నది ఎప్పుడూ లేదు. మహానేత  హయాంలో పసుపు ధర రూ. 14 వేలుండేది.  ఇప్పుడు రూ. 5 వేలు మాత్రమే పలుకుతోంది. అన్ని జిల్లాలకూ మహానేత వ్యవసాయ బీమా వర్తింపచేశారు.

మహానేత జీవించి ఉంటే ప్రాణహిత పూర్తయ్యి ఉండేది


ప్రతి నీటి చుక్క సద్వినియోగం కావాలనే లక్ష్యంతో దివంగత మహానేత  జలయజ్ఞాన్ని రూపొందించారు. 86 ప్రాజెక్టులు సంకల్పించారు. తెలంగాణకు 25 వేల కోట్లు ఖర్చు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టు పనులు ఆయన జీవించి ఉండగా చకచకా సాగాయి. తరవాత నిలిచిపోయాయి. తెలంగాణ జిల్లాలను సస్య శ్యామలం చేయాలనుకున్నారు మహానేత. 16 లక్షల ఎకరాలకు నీటికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఆయనుంటే ప్రాణహిత-చేవేళ్ళ సుజల స్రవంతి పూర్తయ్యి ఉండేది. 1,56,511 ఎకరాలు సాగులోకి వచ్చి ఉండేవి.

ఇంతే కాకుండా మూడు లక్షల ఎకరాల బీడు భూములను రైతులకు అప్పగించారు. వాటిపై అధికారాన్ని కట్టబెట్టారు. పండిచుకోవడానికి పంట రుణాలు మంజూరు చేశారు. రిమ్సు ఆస్పత్రిని నెలకొల్పారు.  గ్రామీణ యువత బాగా చదువుకోడానికి కృషి చేశారు. అన్ని వర్గాల ప్రజలకు అనుకూలించే పథకాలు ప్రవేశ పెట్టారు.  అందరూ సంతోషంగా ఉండాలని భావించారు. ఆయన అధికారంలో ఉన్న కాలంలో ఏ ఛార్జీలు పెంచలేదు. పన్నులు పెంచలేదు. పార్టీలకు అతీతంగా పథకాలు ప్రవేశపెట్టారు. కరెంటు బిల్లులు పెంచనని చెప్పారు. ఆయన రెక్కల కష్టంమీద వచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు ఆయన హామీలకు తూట్లు పొడుస్తోంది. కిలో బియ్యం రూపాయంటూ మోసంచేస్తున్నారు. అన్ని చార్జీలు పెరిగాయి. కరెంటుఎప్పడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలీదు. వేల పరిశ్రమలు మూతపడ్డాయి. పవర్ హాలిడే ప్రకటించారు. భూములు రేట్లు తగ్గాయి.. రిజిస్ట్రేషన్ ధరలు పెరిగాయి. వడ్డీ లేని రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. తొలి ఏడాది లక్షా నాలుగువేల కోట్ల బడ్జెట్. ఇప్పడు లక్షా అరవై ఒక్క వేల కోట్లయ్యింది. అయినా ప్రజలకు చేకూరిన మేలేమీ లేదు. అమ్మ హస్తం మాయ హస్తమైంది. అందులో ముఖ్యమంత్రి చెప్పిన వస్తువులన్నీ ఉండటం లేదు. తొమ్మిది వస్తువుల తక్కువ పరిమాణంలో ఇస్తున్నారు. కొంచెం ఇస్తే ఒక కుటుంబానికి ఎంత కాలం సరిపోతాయి. గోధుమలు, బియ్యం పురుగులు పట్టినవి ఇస్తున్నారు. దీనికి కేటాయించిన బడ్డెట్ చాలదు.
పక్కా ఇళ్లు కట్టించారు. ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ అన్నారు. అమలు సక్రమంగా లేదు. మహానేత 7 లక్షల ఎకరాలు ఎస్సీఎస్టీలకు ఇచ్చారు. పరిశ్రమలు పెట్టుకోవడానికి 33 శాతం సబ్సిడీ ఇచ్చారు. కరెంటు ధర తగ్గించారు. బడుగు బలహీన వర్గాలకు ప్రయోజనం చేకూర్చేందుకు యత్నించారు. రైతు చైతన్య యాత్ర లెందుకని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్తు లేదు.,. గిట్టుబాటు ధర లేదు..ప్రజలంతా కష్టపడుతున్నారు.

రైతు యాత్రలంటూ చేపడుతున్న యాత్రలు రైతులకు ఏం ఉపయోగం కల్పించడానికి చేస్తున్నారు. దివంగత మహానేత డాక్టర్ రాజశేఖరరెడ్డి గిరిజనులకు పోడు భూములపై గిరిజనులకు హక్కు కల్పించారు. ప్రస్తుత ప్రభుత్వానికి ప్రాజెక్టులు పట్టవు,.. ప్రజల కష్టాలు పట్టవు. రేషన్ సరకులు సరిగా ఇవ్వడం లేదు. బంగారు తల్లిపై చట్టం చేస్తామంటున్నారు. రాజశేఖరరెడ్డిగారు పెట్టిన పథకమే కదా ఇది. ఆయన పథకానికి కొద్ది మార్పులుచేసి బంగారు తల్లి పెట్టారు.

రైతులను ఎగతాళి చేసిన చరిత్ర చంద్రబాబుది

ప్రజా సమస్యలు చంద్రబాబుకు పట్టవు. వాటిపై ప్రభుత్వాన్ని నిలదీయారు. అసెంబ్లీకి రారు. అవిశ్వాసం పెడితే విప్ జారీ చేసి ప్రభుత్వాన్ని కాపాడారు. తొమ్మిదేళ్ళలో ఆయన ఏ వాగ్దానాన్నీ నిలబెట్టుకోలేదు. మద్య నిషేధం, మంగళసూత్రాలు పథకాలు అటకెక్కించారు. నగదు బదిలీ పథకమన్నారు. దాన్ని కాంగ్రెస్ పార్టీతో ప్రారంభింపజేశారు.  ఇప్పుడు రుణమాఫీ అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు దానిగురించి ఆలోచించలేదు. ఆనాడు రైతులును జైల్లో పెట్టించారు. నష్టంపరిహారం కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రైతులను ఎగతాళి చేసిన చరిత్ర చంద్రబాబుది.

 ఆయనకు సొంత ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం. చంద్రబాబుకు విశ్వసనీయత లేదు. నైతిక విలువలు అంతకంటే లేవు.  ఎన్నికలలో ఏదైనా మాట్లాడతారు.. ఏదైనా చేస్తారు. 2009 ఎన్నికలలో తెలంగాణ ఇస్తామన్నారు. తరవాత మాట్లాడలేదు. 2012 లో ఉప ఎన్నికలల్లో ఆయనకు డిపాజిట్లు కూడా రాలేదు. వెన్నుపోటంటే గుర్తొచ్చేది బాబే.  తెహల్కా డాట్ కామ్ ఆయననుఅత్యంత అవినీతిపరుడంది. దేశమంతా హెరిటేజ్ పెట్టాడు. 

జగన్ బాబు కాంగ్రెస్ పా ర్టీ నుంచి బయటకొచ్చినందునే కాంగ్రెస్ కక్ష కట్టింది. బాబుతో కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తోంది. ఎంత రాజకీయం చేసినా.. మన పార్టీకి ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. ఏ ఎన్నికలోనైనా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నాం. బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధం కావాలి. మంత్రులు ఒక్కోరకంగా మాట్లాడుతున్నారు. 26 జీవోలు సక్రమమా కాదా అనేది ముందే చూసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. జగన్ బాబు బయటకు వస్తారు... రాజన్న రాజ్యం స్థాపిస్తారు. తెలంగాణ జిల్లాలను సస్య శ్యామలం చేసుకుందాం.'

Back to Top