ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చిన సురేష్‌రెడ్డి

* సొంత ఖ‌ర్చుల‌తో బోరు
* నీటి స‌మ‌స్య తీరింద‌ని హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న గ్రామ ప్ర‌జ‌ల‌
క‌ర్నూలు: క‌ర్నూలు జిల్లా వెల్దుర్తి మండ‌లం క‌లుగోట్ల గ్రామంలో నీటి స‌మ‌స్య తీవ్రంగా ఉంది. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌మ‌ని ప్ర‌భుత్వాన్ని అడిగినా, అధికారుల‌ను ప్రాదేయ‌ప‌డినా ఫ‌లితం లేకుండా పోయింది. దీంతో సొంత ఖ‌ర్చుల‌తో బోరు వేయించి నీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించారు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు సురేష్ రెడ్డి. వివ‌రాల్లోకి వెళ్లితే... కలుగోట్ల గ్రామంలో నీటి సమస్య తారాస్థాయికి చేరింది. కేవలం రెండు ట్యాంకర్లతో నీరు గ్రామానికి సరఫరా అవుతుండ‌డంతో అవి స‌రిపోక ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు.  ఈ దశలో  గ్రామానికి చెందిన మండల వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, గ్రామపెద్ద సురేష్‌ రెడ్డి దాదాపు రూ.30వేల తన స్వంతఖర్చులతో శుక్రవారం ప్రజల కోసం  బోరు వేశారు. నీరు పుష్కలంగా లభించింది. దీంతో నీటి సమస్య పరిష్కారానికి మార్గం ఏర్పడింది. 190అడుగుల లోతులోనే మూడించుల నీరు లభించడంతో గ్రామస్తులు,  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు హర్షం వ్యక్తం చేశారు.
Back to Top