ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి

పెనుకొండ:

ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలనీ, లేకుంటే ప్రజల మనుగడే ప్రశ్నార్థకమవుతుందనీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు సానిపల్లి మంగమ్మ చెప్పారు. బోయపేటతో పాటు గోనిపేట, వెంకటాపురం తండాలకు చెందిన 350 మంది ప్రజలు  పార్టీలో చేరారు. నాయకులు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, మంగమ్మ, తదితరులు పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి ఆహ్వానించారు. ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి ప్రతి మహిళా సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. జగనన్నను సీఎం చేయడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలన్నారు.  తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ సామాజిక ఆర్థిక, రాజకీయ, విద్య, వైద్య రంగాల్లో వాల్మీకులు అభివృద్ధి సాధించాలని పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమనీ, ఈ నేపథ్యంలోనే మంగమ్మకు అత్యంత కీలకమైన కేంద్ర పాలక మండలి పదవిని అప్పగించారనీ చెప్పారు.

Back to Top