'ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చే‌స్తున్న కిరణ్'

హైదరాబాద్, 11 జూన్‌ 2013:

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు జి. శ్రీకాంత్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. దాని కోసం మూడు సూత్రాలను ప్రతిపాదించిందని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని బడుగు, బలహీన వర్గాలలకు న్యాయం చేసే విధంగా గతంలో ఉన్న మాదిరిగానే జిల్లాను యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అంశంపై అసెంబ్లీలో చర్చకు పట్టుపడతామని వారు తెలిపారు.

Back to Top