వైయ‌స్ జ‌గ‌న్ మూడో రోజు యాత్ర ప్రారంభం

వైయ‌స్ఆర్ జిల్లా:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా మూడో రోజు  వైయ‌స్ఆర్ జిల్లా నేలతిమ్మాయిపల్లి నుంచి పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. బుధవారం ఉదయం 8.40 గంటలకు ఆయన మూడో రోజు పాదయాత్ర మొదలుపెట్టారు. జననేత వెంట నడిచేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు. ఈ రోజు 16.2 కిలోమీటర్లు ఆయన నడవనున్నారు.  ఉరుటూరులో ఈరోజు యాత్ర ముగించనున్నారు. ఈ నెల 6న ఇడుపుల‌పాయ‌లో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభించిన వైయ‌స్ జ‌గ‌న్  మొదటి రోజు 10 కిలోమీటర్లు, రెండో రోజు 12.8 కిలోమీటర్లు నడిచారు.  
Back to Top