16 నుంచి ప్రకాశం జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర

ఒంగోలు:

 పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకోడానికి వైయస్ ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఈ నెల 16 వ తేదీ నుంచి ప్రకాశం జిల్లాలో ప్రవేశించనుంది. ఇప్పటికే రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా  కందుకూరు నియోజకవర్గంలోకి ఈ నెల 16 వ తేదీన  వస్తుందని ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో దాదాపు 255 కిలోమీటర్ల మేర జననేత పాదయాత్ర చేయనున్నారని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో కందుకూరులో మొదలై, కొండపి, కనిగిరి, మార్కాపురం, సంతనూతలపాడు, దర్శి, అద్దంకి, పర్చూరు, చీరాల్లో ప్రజా సంకల్పయాత్ర నిర్వహించనున్నారు. దాదాపు 20 రోజుల పాటు ఈ జిల్లాలో పాదయాత్ర జరుగనుంది.

Back to Top