బ్ర‌హ్మ‌ర‌థం

- కృష్ణా జిల్లాలో విజ‌య‌వంతంగా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
- జ‌న‌నేత‌కు అడుగ‌డుగునా ఘ‌న స్వాగ‌తం
- సాయంత్రం నూజివీడులో బ‌హిరంగ స‌భ‌
కృష్ణా జిల్లా:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు  వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 141వ రోజు  నూజివీడు నియోజ‌క‌వ‌ర్గంలోని ఈదర శివారు నుంచి శనివారం ఉదయం వైయ‌స్ జగన్‌ పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం సీతారాంపురం, బత్తులవారిగూడెం క్రాస్‌ మీదుగా యనమదలకు పాదయాత్ర చేరుకుంటుంది. ఈ సందర్భంగా వైయ‌స్‌ జగన్‌కు నూజివీడు ప్ర‌జ‌లు ఘనస్వాగతం పలికారు. రాజన్నబిడ్డను కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఇవాళ సాయంత్రం  నూజివీడులోని చిన్న గాంధీ బొమ్మ సెంటర్‌కు చేరుకుని వైయ‌స్‌ జగన్‌ బహిరంగ సభలో పాల్గొంటారు.  సీతారాంపురం గ్రామంలో స్థానికులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. వేల మంది ప్రజలు వైయ‌స్‌ జగన్‌తో కలసి అడుగులో అడుగేస్తున్నారు.
 బత్తులవారిగూడెం క్రాస్ వ‌ద్ద ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు.  
గతేడాది నవంబర్‌ 6న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. 180 రోజుల పాటు 125 నియోజకవర్గాల్లో 3 వేల కిలోమీటర్ల మేర వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర సాగనుంది. ఇప్పటివ‌ర‌కూ వైయ‌స్ఆర్‌ జిల్లా, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాద‌యాత్ర పూర్తి చేసుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది.
Back to Top