నేటి నుంచి కృష్ణా జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర

విజయవాడఃవైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ర్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజాసంకల్పయాత్ర నేడు ( శనివారం) కృష్ణాజిల్లాలో ప్రవేశించనుంది.గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉదయం ప్రారంభమై కనకదుర్గమ్మ వారధి వద్ద కృష్ణాజిల్లాలో ప్రవేశిస్తుంది అని విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను తెలియచేశారు.ఇడుపుల పాయలో ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర ఇప్పటికే ఏడు జిల్లాల్లో పూర్తయిందని తెలిపారు.ఈ యాత్రలో   వైెయస్ జగన్ మోహన్ రెడ్డి అనేక వందల పట్టణాలు, గ్రామాలలో పాదయాత్ర సాగించారని తెలిపారు.ప్రజాసంకల్పయాత్రలో పేదలు,టిడిపి ప్రభుత్వంలో అన్యాయానికి గురైన వారు జగన్ మోహన్ రెడ్డిని కలసి తమ భాదలు చెప్పుకుంటున్నారని వివరించారు.కృష్ణాజిల్లాలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిదిలోో ప్రజాసంకల్పయాత్ర విజయవంతం చేసేందుకు వైెెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంసిధ్దంగా ఉన్నారని తెలిపారు.ఈ సందర్బంగా విజయవాడ నగరంలో శనివారం నాడు ప్రజాసంకల్పయాత్ర సాగే షెడ్యూల్ ను విడుదల చేశారు.

నేటి పాద‌యాత్ర షెడ్యూల్ః
1 కనక దుర్గ  వారధి 
2 ఫ్లైఓవర్
3 పశువుల ఆసుప్రతి
4 శిఖామణి సెంటర్
5 పుష్ప  హోటల్ సెంటర్
6 కొత్తవంతెన సెంటర్
7 బి.ఆర్ టి.ఎస్.రోడ్డు
8 మీసాల రాజారావు రోడ్డు
9 ఎర్ర కట్ట
10 చిట్టినగర్ సాయంత్రం బహిరంగసభ
Back to Top