14న విశాఖ‌లో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌వేశం


 విశాఖపట్నం : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఈ నెల 14న విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశిస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. ఈ మేర‌కు రూట్ మ్యాప్‌ను ఖ‌రారు చేశారు. ఈ సంద‌ర్భంగా అమ‌ర్‌నాథ్  మీడియాతో మాట్లాడుతూ.. గన్నవరం మెట్టు వద్ద రాజన్న తనయుడు వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర జిల్లాలో ప్రవేశిస్తుందని చెప్పారు. జ‌న‌నేత‌ పాదయాత్ర చరిత్రలో నిలిచి పోతుందని, అన్ని వర్గాల ప్రజలు వాళ్ల కష్టాల్ని ప్రతిపక్షనేతకు చెప్పుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 102 నియోజకవర్గాల్లో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేశారని, ప్రతి నియోజకవర్గంలోనూ ఒక నిర్ధిష్టమైన ప్రకటన చేస్తున్నారని చెప్పారు. 

విశాఖ జిల్లా ప్రజలు కూడా జననేత వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రకు మద్దతు తెలపాలని అమర్‌నాథ్‌ పిలుపునిచ్చారు. ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేక హోదా కోసం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు (లోక్‌సభ) 14 నెలల పదవీ కాలాన్ని త్యాగం చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఏపీ హక్కుల కోసం వైయ‌స్ఆర్‌ సీపీ నిరంతరం పోరాడుతునే ఉంటుందన్నారు. విశాఖ గ్రామీణ ప్రాంతాల్లో 210 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుందని, 7 బహిరంగ సభల్లో వైయ‌స్‌ జగన్‌ పాల్గొంటారని.. 25 రోజుల పాటు జిల్లాలో పర్యటన ఉంటుందని వెల్లడించారు. గిరిజన సమస్యలపై  వైయ‌స్‌ జగన్‌ స్పష్టమైన ప్రకటన చేస్తారని, రైల్వేజోన్‌ అంశాన్ని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్తామని గుడివాడ అమర్‌నాథ్‌ వివరించారు.

తాజా ఫోటోలు

Back to Top