జూన్‌ 11న తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రజా సంకల్ప యాత్ర


తూర్పుగోదావరి : వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జూన్‌ 11న సాయంత్రం తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రజా సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ..తూర్పు గోదావరి జిల్లాలో 17 నియోజకవర్గాల్లో వైయస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుందన్నారు. జిల్లాలో 300 కిలోమీటర్ల మేర సాగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీనామాలు చే శామని చెప్పారు. మా రాజీనామాలు స్పీకర్‌ ఫార్మెట్‌లో ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 29న స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలుస్తామని ఆయన వెల్లడించారు. 


 
Back to Top