ప్రజా సంకల్పయాత్ర@2000 కిమీ.

ఏలూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర  సోమవారం మధ్యాహ్నం 2 వేల కిలోమీటర్ల మైలురాయిని దాటింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం వెంకటాపురం గ్రామంలో ఈ మైలురాయిని  చేరుకున్న సందర్భంగా వైయస్‌ జగన్‌ కొబ్బరిమొక్కను నాటారు. వెంకటాపురంలో ఏర్పాటు చేసిన 40 అడుగుల పైలాన్ను కూడా వైయస్‌ జగన్‌ ఆవిష్కరించారు. పార్టీ శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి 2 వేల కిలోమీటర్ల మైలు రాయిని దాటడాన్ని ఒక పెద్ద ఉత్సవంగా నిర్వహించారు. చిన్నా పెద్దా, ముసలి ముతకా, యువత అందరూ భారీగా తరలి వచ్చి జననేత పాదయాత్రకు సంఘీభావం ప్రకటిస్తూ ఆయన అడుగులో అడుగేస్తూ నడుస్తున్నారు.  తమ సమస్యలను పరిష్కరించడానికి, వైయస్‌ జగనే చుక్కాని అంటూ విశ్వసిస్తూ మద్దతుగా నిలుస్తున్నారు. ప్రజల సంక్షేమం అభివృద్ధే లక్ష్యంగా నవరత్నాలను ప్రకటించి వాటి అమలుకు భరోసా ఇస్తూ,  చంద్రబాబు దుష్టపాలనను ఎండగడుతూ జననేత పాదయాత్ర చేస్తున్నారు.

గత ఏడాది నవంబరు 6 తేదీన ప్రారంభమై 161 రోజుల పాటు కొనసాగుతూ 2000వేల కిలోమీటర్ల మైలురాయి దాటింది. ఈ పాదయాత్ర నిన్న (ఆదివారం) ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకుని,  తొమ్మిదో జిల్లాలోకి అడుగుపెట్టింది. ప్రజా సంకల్పయాత్ర  75 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 125 మండలాలు, 1050 గ్రామాల్లో విజయవంతంగా సాగింది. 


Back to Top