1800 కి.మీ చేరువలో ప్రజా సంకల్పయాత్ర

విజయవాడ: ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర  కాసేపట్లో మరో మైలు రాయిని చేరుకోనుంది. ప్రస్తుతం కృష్ణా జిల్లా మైలవరం లో జరుగుతున్న పాదయాత్ర గణపవరం వద్ద 1800 కిలోమీటర్ల మార్కును దాటనుంది. పాదయాత్రలో మైలురాయి తమ గ్రామంలో పూర్తి కానున్న నేపథ్యంలో గణపవరం ప్రజలంతా సందడి చేస్తున్నారు. ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది. 1800 కిలోమీటర్ల మైలురాయిను చేరుకున్న ప్రాంతంలోపెద్ద ఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వైయస్ జగన్ ఒక మొక్కను నాటడంతో పాటు పార్టీ జెండా ఆవిష్కరణ కూడా చేయనున్నారు.
గత ఏడాది నవంబరు 6 వ తేదీన ప్రారంభమైన పాదయాత్ర ఇప్పటి వరకు కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం , గుంటూరు జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతూ, అడుగులో అడుగేస్తూ సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఎక్కడ చూసినా ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు తమ సమస్యలను జననేతకు వివరిస్తూ పరిష్కరించమని విజ్ఞప్తి చేస్తున్నారు.
Back to Top