సైదాపురంలో ‘వెయ్యి’ మైలురాయి ఏర్పాట్లు

నెల్లూరు

: ఇడుపులపాయ నుంచి మొదలైన ప్రజా సంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో
వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని దాటనుంది. ప్రతిపక్షనేత వైయస్‌
జగన్‌మోహన్‌రెడ్డి రాకకోసం నెల్లూరు జిల్లా సైదాపురం వాసులు ఆసక్తితో
ఎదురుచూస్తున్నారు. జననేత పాదయాత్ర తమ ప్రాంతంలో వెయ్యి కిలోమీటర్ల
మైలురాయిని దాటుతుండడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు జననేత
వైయస్‌ జగన్‌ సైదాపురంలో వెయ్యికిలోమీటర్ల పాదయాత్ర పూర్తి
చేసుకుంటున్నందున స్థానిక ప్రజలు 25 అడుగుల స్థూపాన్ని ఏర్పాటు
చేస్తున్నారు. అంతే కాకుండా గ్రామం నిండా ఫ్లైక్సీలు, రంగు రంగుల
ముగ్గులు, పూల స్వాగతాలను ఏర్పాటు చేశారు.

Back to Top