ప్రధానికి వైవి సుబ్బారెడ్డి లేఖ..!

పొగాకు రైతులను ఆదుకోవాలని వినతి..!
రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్..!

వైఎస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పొగాకు రైతులను ఆదుకోవాలని కోరుతూ ప్రధానమంత్రికి లేఖ రాశారు.పొగాకు బోర్డు, పొగాకు కొనుగోలు చేసే కంపెనీల మధ్య రైతులు నలిగిపోతున్నారని వైవి సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చొరవ తీసుకోవాలని లేఖ ద్వారా ప్రధానిని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు 27 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని...అందులో ఎక్కువగా పొగాకు రైతులు ఉండడం బాధాకరమన్నారు.
Back to Top