ప్రచారానికి కోట్లు.. పేదలకు ఉత్తి చేతులు

రాఘవాపురం(చింతలపూడి), 13 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల సోమవారం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలంలో పర్యటిస్తున్నారు. రాఘవాపురంలో ఆమె ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు.  పేదలన్నా.. రైతులన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రైతుకు రాబడి తగ్గించి ఖర్చులు పెంచారని మండిపడ్డారు. తన ప్రచారానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ముఖ్యమంత్రి పేదలకు వడ్డీలేని రుణాలు ఇవ్వడంలో మాత్రం మొండిచేయి చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. అవినీతి ప్రభుత్వాన్ని దించుదామనుకుంటే.. చంద్రబాబు కాపాడుతున్నారని శ్రీమతి షర్మిల మండిపడ్డారు.

జగనన్న ముఖ్యమంత్రయితే పక్కా ఇళ్ళు

జగన్ ముఖ్యమంత్రయితే ఇళ్లు లేనివారికి పక్కా ఇళ్లు నిర్మిస్తామని  హామీ ఇచ్చారు. రైతులు నష్టపోకుండా పంటను ప్రభుత్వానికే అమ్మేలా చేస్తామని, రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని తెలిపారు. కరెంట్ ఛార్జీలు పెంచి రూ.30 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేశారని, విద్యార్థులకు రావాల్సిన బస్‌పాస్‌ రాయితీలను కూడా పెంచేశారని ఆమె చెప్పారు. జగనన్న సీఎం అయితే అన్ని సంక్షేమ పథకాలు అమలులోకి వస్తాయనీ, రాజన్న రాజ్యాన్ని జగనన్న తిరిగి స్థాపిస్తారనీ శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు.

Back to Top